కొడుకుని ఆదర్శంగా చూపిస్తూ.. కూతురికి క్లాస్ పీకిన చిరు..?

మెగాస్టార్ చిరంజీవి… ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా నిలిచాడు. ఇలా ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తూ అందరి మంచి చెడులు చూసుకుంటున్న చిరంజీవి తన కూతురు విషయంలో మాత్రం చేతకానీ వాడిలా మిగిలిపోయాడని విమర్శలు వినిపిస్తున్నాయి. మెగా కుటుంబం నుండి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగా వారసులందరూ ఆ కుటుంబ పరువు ప్రతిష్టలు పెంచేలా వ్యవహరిస్తున్నారు.

అయితే మెగా కుటుంబంలో ఉన్న కూతుర్లు మాత్రం కుటుంబ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మెగా కుటుంబం నుండి హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నిహారిక అందరికీ షాక్ ఇచ్చింది. అందరూ ఎంత చెప్పినా వినకుండా నిహారిక హీరోయిన్ గా మారింది. అయితే హీరోయిన్ గా సక్సెస్ అవ్వకపోవడంతో పెళ్లి చేసుకుని పక్కకి తప్పుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఆయనకి పెద్ద తలనొప్పిగా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో శ్రీజ ఇంటి నుండి పారిపోయి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక బిడ్డని కూడా కనింది. ఆ తర్వాత అతనితో గొడవపడి కూతుర్ని తీసుకుని చిరంజీవి వద్దకు వచ్చింది.

కూతురు పరువు తీసిన కూడా కన్న ప్రేమ వల్ల చిరంజీవి కూతుర్ని హక్కున చేర్చుకొని తన బాగోగులు చూసుకుంటూ ఆమె జీవితం సుఖంగా ఉండాలని కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి రెండవసారి పెళ్లి జరిపించాడు. కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకున్న శ్రీజ కొంతకాలానికి అతనితో ఒక కూతురికి జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత చాలా కాలం సంతోషంగా ఉన్న ఈ జంట గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో చిరంజీవి శ్రీజ ఇలా చేయడంతో ఆమె మీద చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రామ్ చరణ్ నా పరువు మర్యాదలు నిలబెట్టడానికి కష్టపడుతుంటే నువ్వు నా పరువు తీసే పనులు చేస్తున్నావు అంటూ శ్రీజ మీద ఫుల్ ఫైర్ అయినట్లు తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి.