ఇప్పటివరకూ సినిమా వాళ్లు చాలా మంది చాలా సహాయాలు చేసారు. తెలుగు రాష్ర్టాల్లో సినిమా వాళ్ల వల్ల లబ్ధి పొందింది చాలా మందే ఉన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా చాలామంది స్టార్ హీరోలు సహాయం అంటూ తమ ఇంటి గడప తొక్కితే చేయకుండా పంపించింది లేదు. పవన్ కళ్యాణ్ ఓ నటుడిగా కన్నా సేవాదృక్ఫథం గల వ్యక్తిగానే ప్రజలకు బాగా దగ్గరయ్యారన్నది జగమెరిగిన వాస్తవం. ఇక మహేష్ శ్రీమంతుడు సినిమా తర్వాత తన సొంత గ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకుని అక్కడ అన్ని రకాల వసతీ సౌకర్యాలు కల్పిస్తున్నారు. మహేష్ సతీమణి నమ్రత ఎప్పటికప్పుడు అత్తగారి ఊరిని సందర్శిస్తుంటారు.
నేరుగా ఆమె ప్రజల బోగ భాగ్యాలు అడిగి తెలుసుకుంటారు. ఇంకా చిన్నారులు గెండె సంబంధిత వ్యాధులతో బాధపడుతు న్నా..ఆవిషయం మహేష్ కి తెలిస్తే వెంటనే స్పందించి ఆపరేషన్ కు అసవరమైన ఏర్పాట్లు లాంటివి చేస్తుంటారు. రామ్ చరణ్ , ఎన్టీఆర్ సహా తమ దృష్టికి ఇలాంటి సమస్యలు వెళ్లాయంటే కచ్చితంగా ముందుండి ఆదుకుంటారు. మరి వీటిపై ఇప్పుడున్న తెలుగు దేశం పార్టీ నేతలు ఏరోజైనా స్పందించారా? అంటే మచ్చుకు ఒకటి కూడా ఉండదు. పవన్ కళ్యాణ్ టీడీపీతో జత కట్టినప్పుడు, ఆ పార్టీ అవసరమైన ప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ సేవల్ని కొనియాడటం చూసాం.
మరి మహేష్ , ఎన్టీఆర్, రామ్ చరణ్ , చిరంజీవి సేవల్ని చంద్రబాబు అండ్ కో ఎప్పుడైనా మెచ్చుకుందా? అంటే మచ్చుకు ఒకటి కూడా ఉండదు. కానీ ఇప్పుడు పర భాష హిందీ నటుడు సోనుసూద్ చిత్తూరు జిల్లా రైతు కష్టాన్ని చూసి ట్రాక్టర్ కొనిస్తే ఆ నటుడిని పచ్చ బ్యాచ్ రౌండప్ చేసి ఆకాశానికి ఎలా ఎత్తేస్తుందో చూస్తున్నా ఉన్నాం. చంద్రబాబునాయుడు, లోకేష్, సొమిరెడ్డి తాజాగా వర్ల రామయ్య తెగ పొగిడేస్తున్నారు. తప్పులేదు మంచి కార్యక్రమం తలపెట్టి చేసినప్పుడు మెచ్చుకోవడం మంచిదే. మరింత మందికి స్పూర్తిని నింపుతుంది. కానీ పచ్చ బ్యాచ్ అంతా ఇలా కట్టగట్టుకుని మరీ ఎత్తుకోవడం చూస్తుంటే వెనుక ఏదో వ్యూహం లేకుండా ఉంటుందా? అని కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.