మోడీ కి జగన్ ఇచ్చిన బిగ్గెస్ట్ ఆఫర్ గురించి దేశం మొత్తం డిస్కషన్ లు !

 

రాజకీయం అంటే అరాచకీయమే.. ఎందుకంటే ఇక్కడ తమకంటూ మిత్రులు, శత్రువులు అని ప్రత్యేకంగా ఎవరు ఉండరు.. కానీ అవకాశవాదులకు మాత్రం కొదువే ఉండదు.. ఒకరిని తొక్కి ఒకరు ఎదగ గల కెపాసిటీ ఉన్న వారు మాత్రమే రాజకీయ సుడిగుండాలలో తట్టుకుని నిలబడతారు.. అయితే ఒక్కోక్క సారి అధికారంలో ఉన్న వారు చేసే తప్పులు వారి పదవులకే ముప్పుగా మారే అవకాశం ఉంది.. ఇప్పుడు ఏపీలో ఇదే పరిస్దితి నెలకొంటుందనే ప్రచారం జరుగుతుంది..

ఇక వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పధకాలను అమలుచేస్తున్నారు.. పేద వారు, రైతులు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు వారికి అండగా నిలుస్తున్నారు.. కానీ వైసీపీలోని కొందరి నాయకుల చేష్టల వల్ల, వారి ప్రవర్తనల వల్ల సీయం జగన్ అభాసుపాలవుతున్నారు. ఇలాంటి బలహీనతలే ప్రతిపక్షానికి అవకాశంగా మారుతుంది.. ఇకపోతే కేంద్రంలో అధికార చక్రాన్ని విజయవంతంగా తిప్పుతున్న బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తన పాగా వేయలేకపోతుంది.. దీనికోసం ఎంతగా శ్రమిస్తున్న ఇక్కడున్న ప్రాంతీయ అభిమానం వల్ల తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టలేక పోతుంది.. ఇక ప్రస్తుతం ఏపీలో ఉన్న హిందు ఆలయాల దాడుల అంశం తీవ్ర దుమారం రేపుతుండ‌గా, మంత్రి కొడాలి నాని కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి..‌.

ఇదంతా పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి అందించే నిధుల విష‌యంలో ఎక్కువగా జాప్యం చేస్తుంది. ఇదే విషయంలో బీజేపీ రాష్ట్ర నాయ‌కుల‌ను, అధికార పార్టీ నేత‌లు సుల‌భంగా టార్గెట్ చేసే అవ‌కాశం ఉంద‌నేది నిపుణులు చెబుతున్న మాట.. ఈ విషయంలో నోరెత్తకుండా ఉండటం అధికార పార్టీకి మైనస్‌గా మారింది.. అదీగాక, దేవాల‌యాల భ‌ద్ర‌త విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం, భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా మాట్లాడ‌టం వ‌ల్ల వైసీపీకి న‌ష్టం జ‌ర‌గడం, ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న నేత‌ల‌కు లాభం జ‌ర‌గ‌డం ఖాయ‌మనే అంతా అనుకుంటున్నారట..

 

ఈ దశలో ఏపీలో ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి అన్న‌ట్లుగా జరుగుతున్న వరుస సంఘటనలు, ప‌లువురు నేత‌ల కామెంట్లు దీనికి ఆజ్యం పోస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి.. ఒక రకంగా వైఎస్ జగన్ తన సీటుకు తానే ఎసరు పెట్టుకుంటున్నట్టుగా ఉందనే వాదన లేకపోలేదు.. ఇలాంటి పరిస్దితులను వైఎస్ జగన్ తట్టుకుని ఎలా నెగ్గుకొస్తారనేది ప్రస్తుతం పలువురిలో ఆసక్తిగా మారింది..