షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ది వారియర్ సినిమా.. విడుదల తేది ఖరారు..!

దేవదాసు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెడీ, మస్కా, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ సినిమాలలోనటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇష్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత రామ్ పోతినేని తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో ది వారియర్ అనే యాక్షన్ సినిమాలో నటించాడు. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో రామ్ కి జోడి గా కృతిశెట్టి నటించింది. రామ్ మొదటిసారి ఈ సినిమాలో పోలీస్ పాత్రలో ప్రేషకులను అలరించబోతున్నాడు.ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రామ్ ఫోటోలు సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమ జూలై 14 న విడుదల కానుంది. అందువల్ల ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు.

అందులో భాగంగా ఈ సినిమా నుండి హై వోల్టేజ్ యాక్షన్ టీజర్‌ని విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇటీవల ఈ సినిమా హిందీ వెర్షన్ డబ్బింగ్ రైట్స్ 16 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమ జూలై 14వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమ టీజర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ది వారియర్ సినిమా తెలుగు,తమిళ భాషల్లో కలిపి డిస్నీ హాట్ స్టార్ రూ. 35 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమాకు విడుదలకు ముందే నాన్ థియేట్రికల్‌గా 41 కోట్లు లాభం వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.