బిగ్ బాస్ హౌజ్ ని బీభత్సంగా వాడుకున్న స్టార్ మా.. వాడకం మామూలుగా లేదుగా?

బుల్లితెర మీద ప్రసారమైన రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ 5 సీజన్లు బుల్లితెర మీద ప్రసారమయ్యే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ మాత్రం ఓటిటిలో 24/7 ప్రసారమౌతు మంచి ప్రేక్షకాదరణ పొందింది. అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ పూర్తి కాకముందు నుండి బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అంటూ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటివరకు సీజన్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్ లాస్ట్ ఫైనల్ లిస్ట్ కూడా అధికారికంగా ప్రకటించలేదు.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కోసం తయారు చేసిన బిగ్ బాస్ హౌజ్ ని స్టార్ మా ఛానల్ వారు బీభత్సంగా వాడుకున్నారు. స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న సీరియల్స్ కి చెందిన నటి నటులు బిగ్ బాస్ హౌజ్ లో సందడి చేశారు. మొత్తం 16 మంది బుల్లితెర నటులను బిగ్ బాస్ హౌజ్ లోకి తీసుకెళ్ళి వారితో రియల్ బిగ్ బాస్ మాదిరిగా ఫన్నీ టాస్క్ లు ఇచ్చి సందడి చేశారు. ఈ షో కి సుమ హోస్ట్ గా వ్యవహరించింది. మామూలుగా ఆదివారం రోజు స్టార్ మా ఛానల్ లో సినిమా వేస్తారు. కానీ నిన్న మాత్రం స్టార్ మా ఛానల్ కి సంబంధించిన బుల్లితెర నటులను బిగ్ బాస్ హౌస్ కి తీసుకెళ్లి స్టార్ మా పరివార్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అంటూ ఒక షో నిర్వహించారు.

ఈ షో లో పాల్గొన్న వారికి టాస్క్ లు ఇచ్చి ఓడిపోయిన వారిని ఎలిమినేట్ కూడా చేశారు. మొత్తం 16 మంది బుల్లితెర నటులు ఈ షో లో పాల్గొనగా తేజశ్వి, అమర్ దీప్ ఫైనల్ కంటెస్టెంట్ గా నిలబడ్డారు. సీరియల్ స్టార్ సెలబ్రిటీస్ ఓటుతో అమర్ దీప్ వన్ డే బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ రియాలిటీ షో అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రియాల్టీ షో. కానీ సీరియల్ సెలబ్రిటీలతో ఈ బిగ్ బాస్ ఆటని ఒక సరదా ఆటగా మార్చేశారు. ఈ ఒక్కరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రేక్షకులని బాగా అలరించింది. కానీ దీని ఎఫెక్ట్ బిగ్ బాస్ సీజన్ 6 మీద పడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.