నిర్మాతలకు తలనొప్పిగా మారిన స్టార్ హీరోయిన్ వ్యవహారం?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారంగా కొనసాగుతున్న పూజ హెగ్డేకు వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు రావడంతో ఈమె కెరియర్ ఇబ్బందులలో పడుతుందని చాలామంది భావించారు. అయితే ఈమె వరసగా మూడు ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొన్నప్పటికీ ఈమెకు వరుస అవకాశాలు రావడంతో పూజా హెగ్డే గోల్డెన్ లెగ్ అంటూ భావిస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఈమె పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెలుగు ఎక్కుతున్న జనగణమన సినిమాలో నటిస్తున్నారు.అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. పూజా ఫ్లాప్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఈమెకు వరుసగా పాన్ ఇండియా సినిమా అవకాశాలు రావడంతో ఏకంగా తెలుగు సినిమాలను రిజెక్ట్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. అదేవిధంగా పలు సినిమాలలో నటించిన పెద్ద ఎత్తున కండిషన్లు పెట్టి నిర్మాతలకు తలనొప్పిగా మారిపోయింది.

ఇకపోతే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా కోసం పూజా హెగ్డే ఏకంగా నిర్మాతలకు మూడు కండిషన్లు పెట్టినట్లు తెలుస్తుంది.మొదటి కండిషన్ గా ఈ సినిమా కోసం ఈమె కేవలం 45 రోజులకు కాల్ షీట్స్ మాత్రమే ఇవ్వనుందట. అంతకన్నా ఒక్కరోజు ఎక్కువ అన్నా కూడా తాను చేయనని కండిషన్ పెట్టారని సమాచారం.

ఇక రెండవ కండిషన్ విషయానికొస్తే తనకు ఈ సినిమా కోసం రెండు కోట్ల రూపాయల పారితోషకం ఇవ్వాలని కండిషన్ పెట్టారట.అదేవిధంగా మూడవ కండిషన్ విషయానికొస్తే తనతో పాటు తన స్టాఫ్ కి శాలరీ ఇవ్వడమే కాకుండా వారి ఖర్చులను కూడా నిర్మాతలే భరించాలని కండిషన్ పెట్టడంతో నిర్మాతలు ఈమె కండిషన్ కి విసుగు చెందుతున్నారు. ఇలా పూజా హెగ్డే వరుసగా కండిషన్లు పెట్టడంతో నిర్మాతలకు ఈమె వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిందని తెలుస్తోంది.