Big Boss6: బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టనున్న అలనాటి స్టార్ హీరో…?

Big Boss6: ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా.. కోరుకున్న ప్రియుడు సినిమా ద్వార హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తాళి, మనసిచ్చి చూడు, చెప్పాలని ఉంది, వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. దీంతో నవీన్ ఒకప్పుడు ఒక స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. అయితే కొన్ని సంవత్సరాలుగా వడ్డే నవీన్ సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్నాడు. టీవీ షోస్ లో కానీ, సినిమాలో గెస్ట్ రోల్ లో కానీ నవీన్ ఎక్కడా కనిపించలేదు.

అయితే ప్రస్తుతం వడ్డే నవీన్ గురించి ఒక వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎంతో మంచి గుర్తింపు పొందిన ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 6 లో వడ్డే నవీన్ పాల్గొంటున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ షో కి ప్రేక్షకులలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లి తెర మీద మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా ఈ షో కి మంచి ఆదరణ లభించింది. ఇటీవల ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ముగిసింది. దీంతో సీజన్ 6 కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యింది. దీంతో ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి ప్రతిరోజు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ ఈ షోలో పాల్గొనే వారి ఫైనల్ లిస్ట్ మాత్రం బయటకి రాలేదు.

తాజాగా హీరో వడ్డే నవీన్ కూడా ఈ షోలో పాల్గొంటున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వడ్డే నవీన్ కి బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం వచ్చినా కూడా దాన్ని తిరస్కరించాడు . దీంతో ఎలాగైన అతనిని బిగ్ బాస్ షో లోకి తీసుకురావాలని బిగ్ బాస్ యాజమాన్యం వారు అతనికి ఎక్కువ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం వడ్డే నవీన్ బిగ్ బాస్ సీజన్ 6కి కంటెస్టెంట్‌గా వస్తారా? రారా అన్నది ప్రేక్షకులలో చాలా ఆసక్తిగా మారింది. ఈ హీరోను స్క్రీన్ మీద చూసి చాలా కాలం అవటంతో నవీన్ బిగ్ బాస్ లో పాల్గొంటే బాగుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఒకవేళ వడ్డే నవీన్ బిగ్ బాస్ షో కి వస్తే మాత్రం అతను ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 6లో స్పెషల్ అట్రాక్షన్ అవ్వటం మాత్రం ఖాయం.