Big Boss: దారుణంగా మారిన బిగ్ బాస్ విన్నర్స్ పరిస్థితి.. బిందు అయిన బ్రేక్ చేస్తుందా?

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి.ఈ కార్యక్రమం ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకోవడమే కాకుండా ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా మొదటి సీజన్ నుంచి వరుసగా శివబాలాజీ, కౌశల్, రాహుల్, అభిజిత్, సన్నీ ఐదు సీజన్లలో విజేతలుగా నిలవగా, నాన్ స్టాప్ కార్యక్రమంలో బిందు మాధవి విజేతగా నిలబడ్డారు.

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం వీరికి ఎన్నో అవకాశాలు వస్తాయని చాలా మంది భావిస్తారు.నిజం చెప్పాలంటే విన్నర్ గా నిలిచిన వారి కన్నా మిగతావారు ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు.ఇక బిగ్ బాస్ విజేతలుగా గెలిచిన వారు ఎలాంటి సినిమాలను కాని కొత్త ప్రాజెక్టుల కాని చేపట్టకుండా ప్రస్తుతం ఖాళీగానే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా బిగ్ బాస్ విజేతల గెలిచినప్పటికీ వీరికి పెద్దగా ప్రయోజనం లేదని చెప్పాలి.ఇక నాన్ స్టాప్ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ఒక లేడీ కంటెస్టెంట్ గెలవడం బిగ్ బాస్ చరిత్రలోనే ఇది మొదటిసారి. ఇలా నాన్ స్టాప్ కార్యక్రమంలో గెలిచిన బిందుమాధవి అయిన వరుస అవకాశాలను అందుకుని దూసుకుపోతారా.. లేదంటే తాను కూడా అందరిలాగే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారా అనే విషయం తెలియాల్సి ఉంది.