Mark Shankar: పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ ఇటీవల ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సింగపూర్లో చదువుతున్న ఈ చిన్నారి పాఠశాలలో అనుకోకుండా అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ అన్ని ప్రమాదంలో గాయాలు పాలు అయ్యారు.
ఒక్క సారిగా పాఠశాలలో మంటలు చెడరేగడమే కాకుండా దట్టమైన పొగ కూడా కమ్ముకుంది అయితే ఈ భవనంలో పరిస్థితి గమనించిన కొంతమంది సహాయక చర్యలు చేపట్టి పాఠశాలలో చిక్కుకున్న చిన్నారులందరిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. ఇలా పవన్ కళ్యాణ్ కుమారుడిని కూడా నలుగురు భారత్ కి చెందిన కార్మికుల కాపాడారు.
మన దేశానికి సంబంధించిన కొంత మంది వలస కార్మికులు,సమీపంలో ఉన్న భవంతిలో పని చేస్తున్నారు. వాళ్లంతా స్కూల్ భవంతి నుంచి అరుపులు రావడంతో పాటుపెద్ద ఎత్తున పొగలు రావడం గమనించారు.వెంటనే వారంతా ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా తమ ప్రాణాలని పనంగా పెట్టి పాఠశాల లోపలికి వెళ్లి పిల్లలను కాపాడారు.
ఈ విధంగా పసి పిల్లల ప్రాణాలను కాపాడినటువంటి ఈ నలుగురు వ్యక్తులకు సింగపూర్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది అయితే వీరికి కొంత మతంలో నగదు నజరానగా ప్రకటించబోతున్నారా లేదా అనే విషయాలు తెలియదు కానీ ఈ నలుగురు వ్యక్తులను మాత్రం సింగపూర్ ప్రభుత్వం ఎంతో ఘనంగా సత్కరించింది.
పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా సింగపూర్ లో అక్కడ వ్యాపారాలను చేసుకుంటూ అక్కడే ఉంటూ తన ఇద్దరు పిల్లలని చదివిస్తున్నారు. ఈమె కూడా ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతున్న నేపథ్యంలోనే సింగపూర్ లోనే నివాసం ఉంటున్నారు.