puspha Movie: పుష్ప సినిమా నుంచి తొలగించిన ఆ సన్నివేశం.. కారణం అదేనా?

puspha Movie: సాధారణంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలంటే ఫ్యామిలీతో కలిసి సినిమా చూడొచ్చు అనే అభిప్రాయం ప్రతి ఒక్క ఆడియన్స్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే పుష్ప దర్శకత్వంలో వస్తున్న సినిమా అంటే భారీ అంచనాలు పెట్టుకొని ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయిందని చెప్పాలి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో ఒక సన్నివేశాన్ని తొలగించారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సన్నివేశం ఏంటి అనే విషయానికి వస్తే పుష్ప ఫోన్ మాట్లాడుతున్న సీన్. ఈ సీన్లో పుష్ప ఫోన్ మాట్లాడుతున్నప్పటికీ తన చేయిని మాత్రం శ్రీవల్లి ప్రవేట్ పార్ట్స్ పై కన్వే అయ్యే విధంగా ఈ సన్నివేశాన్ని తెరకెక్కించడంతో ఈ సన్నివేశం చూసిన ప్రేక్షకులు సుకుమార్ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఉండడం ఏంటి? అంటూ ఆశ్చర్యపోయారు.

ఇలాంటి సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలంటే కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయని ఫీడ్ బ్యాక్ రావడంతో వెంటనే డైరెక్టర్ సుకుమార్ రంగంలోకి దిగారు. ఇలా రంగంలోకి దిగిన సుకుమార్ వెంటనే ఆ సన్నివేశాన్ని తొలగించారు. ఈ క్రమంలోనే ఈ సన్నివేశాన్ని తొలగించడంతో రేపటి నుంచి (ఆదివారం) సినిమాలో ఆ సన్నివేశం ఉండదని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రేక్షకుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని సుకుమార్ ఈ సన్నివేశాన్ని తొలగించడం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.