Bhalakrishana: బాలకృష్ణ టాక్ షోలో సందడి చేసిన రౌడీ హీరో… అభిమానులకు పూనకాలే!

Bhalakrishana: నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు అన్‌స్టాపబుల్ అనేటాప్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారని చెప్పాలి. ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు హాజరుకాగా వారందరితో బాలకృష్ణ ఎంతో సరదాగా మాట్లాడుతూ వారి పై తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు.ఇక ఇటీవల ప్రసారమైన 8 వ ఎపిసోడ్ లో భాగంగా రానా ఈ కార్యక్రమానికి వచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఈ షోకి రౌడీ హీరో విజయ్ దేవరకొండ వస్తారనే వార్తలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే తాజాగా రానాతో ఈ కార్యక్రమం ప్రసారం కావడంతో వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలను ఆహా విడుదల చేశారు.

దీంతో వచ్చే వారం ఈ కార్యక్రమంలో లైగర్ చిత్ర బృందం సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే బాలకృష్ణతో పాటు విజయ్ దేవరకొండ, లైగర్ సినిమా నిర్మాత ఛార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరైనట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలలో బాలకృష్ణ పంచ కట్టులో కనిపించడంతో ఈ కార్యక్రమం సంక్రాంతి పండుగ సందర్భంగా స్ట్రీమింగ్ అవుతుందనే విషయం తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.