పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఏర్పడింది. వరుసగా సినిమాలు సైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కి మాత్రం సరిగ్గా అటెండ్ అవ్వట్లేదు. మధ్యలో రాజకీయాలతో బిజీ గా మారిన పవన్ కళ్యాణ్ కారణంగా చాలా సినిమాలు షూటింగ్ లు ఆగిపోయాయి.

క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’ అనే సినిమా చాలా నెలల క్రితం స్టార్ట్ అయ్యింది. అయితే కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా షూటింగ్ కొన్నాళ్ళు ఆగింది. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా చేసి రిలీజ్ కూడా చేసేసాడు.

‘హరి హర వీర మల్లు’ తో పాటు హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా కూడా పవన్ సైన్ చేసాడు. కానీ, ఆ సినిమా ఏమైందో ఇప్పటికి తెలియదు. పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం హరీష్ శంకర్ వేచి చూస్తున్నాడు. ఈ మధ్యే సముథిరాఖని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరో గా, పవన్ కళ్యాణ్ ఒక గెస్ట్ రోల్ చెయ్యడని ఒప్పుకున్నాడు కానీ డేట్స్ ఇవ్వలేదు. తాజా ఫిలిం టీం సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించింది. 2023 ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం పీరియాడిక్ సినిమా కావడం వల్లే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని నిర్మాత ఏఎం రత్నం చెప్పారు

ముఘల్ కాలంలో సాగే ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నాడు. త్వరలో జరగబోయే ఓ యాక్షన్ షెడ్యూల్ కి సంబంధించి చిత్రబృందం ఓ ప్రత్యేకమైన సెట్ ను కూడా నిర్మించింది. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.