వెనక్కు తగ్గిన మంచు విష్ణు

ఇండస్ట్రీ కి వచ్చి రెండు దశాబ్దాలు దాటుతున్నా మంచు విష్ణు కి ఇప్పటివరకు కనీసం మినిమం మార్కెట్ లేదు. అప్పుడెప్పుడో వచ్చిన ‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’ తర్వాత కనీసం చిన్న హిట్ కూడా లేదు. పాన్ ఇండియా రేంజ్ లో బిల్డ్ అప్ ఇచ్చిన ‘మోసగాళ్లు’ సినిమా కనీసం వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయింది.

కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘జిన్నా’ అనే సినిమాతో రెడీ అయ్యాడు విష్ణు. అయితే ఈ సినిమాను చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమాలకు పోటీగా దసరాకు విడుదల చెయ్యాలని అనుకున్నాడు విష్ణు.

అయితే, తాజాగా అక్టోబర్ 21, 2022కి ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. అయితే, టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో  సన్నీలియోన్ మరియు పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించారు. ఇంకా సీజీ వర్క్ కంప్లీట్ అవ్వకపోవడం వలనే ఈ సినిమా రిలీజ్ వాయిదాపడ్డట్టు తెలుస్తుంది.