Hero Venu: తొట్టెంపూడి వేణు సినిమాలు చేయకపోవడానికి కారణమేమిటంటే.. !

Hero Venu: స్వయంవరం సినిమా సమయంలో తొట్టెంపూడి వేణుకు, తనకు రిలేషన్ ఉంది కాబట్టి తనకు మంచి లీడ్ క్యారెక్టర్స్ ఇస్తుంటారన్న ప్రచారంపై ప్రముఖ ఆర్టిస్ట్ అనంత ప్రభు స్పందించారు. తామంతా ఒక టీం అని, తాను కూడా అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశానని ఆయన అన్నారు. తనకు అప్పటికే వారు పరిచయం కావడంతో ఆ సినిమాల్లో వేరే వాళ్లను ఎందుకు పెట్టుకోవడమని ఉద్దేశించి తనకు అవకాశం కల్పించారని ఆయన చెప్పుకొచ్చారు.

తొట్టెంపూడి వేణు సినిమాల్లో నుంచి డ్రాప్ కావడానికి కారణాలేంటో నిజంగా తనకు తెలియవని అనంత ప్రభు తెలిపారు. వేణు చేసిన ఐదు సినిమాల్లో తాను 3 సినిమాల్లో మాత్రమే చేశానని ఆయన అన్నారు. తనంటూ ఒక దారి వెతుక్కోవాలి కదా అని బయట ప్రయత్నాల్లో పడ్డానని, అంతే కానీ ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన చెప్పారు. తాను కెరీర్ ప్రారంభంలో ఒకే ప్రొడక్షన్‌లో చేయడానికి కారణం తనకు మంచి వేషాలు పడడమే అని, అప్పుడు కూడా బయట ప్రయత్నిస్తే ఇంకా తనకు మరిన్ని అవకాశాలు వచ్చేవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇకపోతే అతడు సినిమాలో త్రివిక్రమ్ గారు తనకు పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారని, ఆ తర్వాత వరుసగా తనకు అన్నీ పోలీసు వేషాలే వచ్చాయని ఆయన తెలిపారు. రీసెంట్‌గా వచ్చిన మహా సముద్రం అనే సినిమాలోనూ తాను పోలీస్ ఆఫీసర్‌గా చేశానని ప్రభు స్పష్టం చేశారు.