Prabhas : ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రబాస్ వేగంగా సినిమాలు చేయాలనుకున్నాడు. కానీ, చేయలేకపోతున్నాడు. గాయాలు, సర్జరీల కారణంగా ప్రబాస్ అనుకున్న వేగాన్ని అందుకోలేకపోతున్నాడు. ప్రబాస్ చేతిలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలానే వున్నాయ్.
‘రాధేశ్యామ్’ టైమ్‌లోనే కాలి నొప్పితో చాలా బాధపడ్డాడు ప్రబాస్. ఆ నొప్పితోనే ఎలాగో సినిమా పూర్తి చేసేశాడు. కానీ, ఆ తర్వాత తప్పలేదు. సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ కారణంగా మినిమమ్ రెండు నెలలైనా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోక తప్పలేదు ప్రబాస్‌కి.
సో, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. అన్నట్లుగా ఎంత వేగం పెంచాలనుకున్నా, ప్రబాస్‌కి తప్పేలా లేదు. వీలైనంత వేగంగా ‘సలార్’ సినిమాని పూర్తి చేయాలనుకున్నాడట. కానీ ఆ సినిమా ఎంతవరకూ వచ్చిందనేది స్టేటస్ ఇంతవరకూ అప్‌డేట్ రానే లేదు. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందబోయే ‘ఆదిపురుష్’ సినిమా కూడా సెట్స్‌పైనే వుంది.
మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ కె’ కూడా లైన్‌లోనే వుంది. ఈ మూడు సినిమాలను సైమల్‌టేనియస్‌గా పూర్తి చేసేయాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడట ప్రబాస్. కానీ, జాప్యం తప్పేలా లేదు. ఎంతైనా ఆరోగ్యం కన్నా కాదు కదా.. అని సన్నిహితులు ప్రబాస్‌కి సలహా ఇస్తున్నారట. దాంతో రెస్ట్ తీసుకోక తప్పలేదట.
అందులోనూ ప్రబాస్ చేయబోయే ప్రాజెక్టులన్నీ దాదాపు యాక్షన్ మోడ్‌లోనే వుండబోతున్నాయ్. సో, ఫిట్‌నెస్ తప్పనిసరి. అందుకే, ప్రబాస్ పూర్తి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌తో సిద్ధమయ్యాకే, మళ్లీ షూటింగ్స్ షురూ చేయనున్నాడనీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.