Serial Artist: ఎవర్నైనా కడుపు మాడ్చుకునేలా జీవితం మీద దెబ్బ కొడతారో అలాంటి వాళ్లు ఎప్పటికీ గుర్తుంటారని సీరియల్ నటుడు అవినాశ్ అన్నారు. అలాంటి సంఘటనలు కూడా తన లైఫ్‌లో జరిగాయని, అప్పుడు కూడా అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్లు ఉన్నారని ఆయన చెప్పారు. కాకపోతే తాను టైం కోసం ఎదురు చూస్తూ ఉంటానని ఆయన అన్నారు. కర్మ సిద్దాంతం అనేది ఒకటుందని, ఒకరు ఇంకొరికి అన్యాయం చేస్తే, వాళ్లకు వేరొకరు అన్యాయం చేస్తారని ఆయన చెప్పారు.
ఇకపోతే తనతో వర్క్ చేయించుకొని, రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయని అవినాష్ అన్నారు. కాకపోతే ఆ తర్వాత వాళ్ల వెంటపడి, వాళ్లు ఎంతమేరకు ఇవ్వగలరో అంతవరకు వసూలు చేశానని ఆయన చెప్పారు. అందరూ అనుకుంటారు ఆర్టిస్ట్‌లు ఈజీగా సంపాదిస్తారు అని, కానీ లొకేషన్‌కి వచ్చి తాము పడే కష్టం చూస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. షూటింగ్‌కి వచ్చినప్పటి నుంచి ఎంత రాత్రైనా కూడా ప్యాకప్ అయ్యే వరకు నిల్చొనే పని చేయాలని ఆయన చెప్పారు. ఆడియన్స్ చూసేది కాసేపే, కానీ తాము నటించేది మాత్రం గంటల్లోనే ఉంటుందని ఆయన తెలిపారు.
అంత కష్టపడి సంపాదించినపుడు, ఒకడు మన శ్రమను దోచుకొని, నా దగ్గర లేవు, తర్వాత ఇస్తాను, ఉన్నపుడు చెప్తా అంటే మాత్రం చాలా కోపం వస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే తమ కష్టం ఉంది, కష్టపడ్డాము కాబట్టి అని ఆయన చెప్పారు. తానైతే నిర్దాక్షిణ్యంగా వసూలు చేసుకున్నానని, ఆయన లాస్ వచ్చింది అని అన్నా కూడా అంత అవగాహన లేకుండా చేయకుండా ఉండాల్సింది అని ఆయన జవాబిచ్చారు. ఆ ప్రాజెక్టులో తన కష్టం ఉంది. తనకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇవ్వాలని ఆయన కచ్చితంగా చెప్పారు.