విజయ్ దేవరకొండ బోల్డ్ ఫోటోకు ప్యాంటు వేసిన నెటిజన్.. రౌడీ హీరో రియాక్షన్ ఇదే?

విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్థాయిలో మొట్టమొదటిసారిగా నటించిన చిత్రం లైగర్.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకొని ఆగస్టు 25వ తేదీ విడుదల కావడానికి సిద్ధమైంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా విజయ్ దేవరకొండ లుక్ విడుదల చేశారు. అయితే ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ ఎలాంటి దుస్తులు లేకుండా బోల్డ్ లుక్ లో ఉన్నారు. ఇక ఈ ఫోటో విడుదల చేసిన కొంత సమయానికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చెక్కర్లు కొట్టింది. ఇక ఈ ఫోటోపై ఎంతో మంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ కామెంట్లు చేశారు.

ఇక ఈ ఫోటో చూసిన నేటిజెన్లు సైతం పెద్ద ఎత్తున విజయ్ దేవరకొండ ఫోటోపై ట్రోల్స్,మీమ్స్ క్రియేట్ చేశారు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ బోల్డ్ ఫోటో ప్రస్తుతం వైరల్ కావడంతో ఓ నేటిజన్ ఏకంగా ఈ బోల్డ్ ఫోటోను ఎడిట్ చేస్తూ ఆయన ఫోటోకి ప్యాంటు వేశారు. ఇక ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తే విజయ్ దేవరకొండకు ట్యాగ్ చేశారు.ఇక ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాకు తర్వాత థాంక్స్ చెప్పు బ్రదర్ అంటూ కామెంట్ పెట్టారు. ఈ ఫోటో పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

ఈ ఫోటో పై విజయ్ దేవరకొండ కామెంట్ చేస్తూ సకాలంలో ఆదుకునే బ్రదర్ నువ్వే అంటూ కామెంట్ చేయడం విశేషంగా మారింది.సాధారణంగా స్టార్ హీరోలు ఎవరు ఇలా నగ్నంగా ఫోటోలు దిగడానికి ఇష్టపడరు.కానీ ఇలాంటి సాహసం విజయ్ దేవరకొండ లాంటి హీరోలు మాత్రమే చేయగలరని చెప్పాలి. మొత్తానికి విజయ్ దేవరకొండ లుక్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా కోసం రౌడీ హీరో ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.