ఖుషి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన మేకర్… సినిమా విడుదలయ్యేది అప్పుడే?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమంత ప్రధాన పాత్రలలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కాశ్మీర్ లో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి ఖుషి టైటిల్ పెట్టాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలియజేశారు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు.అయితే వీరిద్దరి కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఖుషి టైటిల్ ఖరారు చేస్తూ తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా టైటిల్ను విజయ్ దేవరకొండ చిత్రానికి ఖుషి అనే టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. ఈ క్రమంలోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో తెరకెక్కుతోందని ఈ భాషలకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. అలాగే ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ విడుదల తేదీని కూడా ప్రకటించారు.
YouTube video player

ప్రస్తుతం ఖుషి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ పోస్టర్ వైరల్ గా మారుతూ ఎంతోమంది సమంత, విజయ్ అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి మహానటి సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండడంతో శివ నిర్వాణ దర్శకత్వంలో మరోసారి ఈ జంట తెరపై సందడి చేయనున్నారు. ప్రస్తుతం కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు.