Chiranjeevi – Mahesh Babu: ఫ్లైట్ లోనే సూపర్ స్టార్ కి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్… ఫోటో వైరల్!

Chiranjeevi – Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇక ఈయన హీరోయిన్ నమ్రతను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వంశీ సినిమా ద్వారా కలిసి నటించిన వీరిద్దరికీ ఈ సినిమాతో పరిచయం ఏర్పడడం అలాగే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిన తర్వాత వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు.

ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత నమ్రత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమవుతూ కేవలం ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నటువంటి ఈ జంట నేడు 17వ వివాహ వార్షికోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటుంది.ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులు సినీ సెలబ్రిటీలు ఈ జంటకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే నేడు మహేష్ బాబు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కలవడానికి విజయవాడ చేరుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల, రాజమౌళి వంటి ప్రముఖులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు.ఇలా వీరందరూ కలిసి విమానంలో బయలుదేరిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబుకి విమానంలోనే ఫ్లవర్ బొకే ఇస్తూ మహేష్ బాబు కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన అభిమానులు సైతం మహేష్ బాబు దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.