Kannappa Movie: కన్నప్ప టీం హెచ్చరిక… ఆ పని చేస్తే చర్యలు తప్పవు… తస్మాత్ జాగ్రత్త!

Kannappa Movie: మంచు విష్ణు కన్నప్ప అనే మైథాలజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా కోసం విష్ణు దాదాపు పది సంవత్సరాలపాటు కష్టపడినట్లు తెలుస్తోంది. 10 సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం ఎన్నో పరిశోధనలు చేసి తాను అనుకున్న విధంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ కూడా జరుపుకుంది .

ఇకపోతే గత కొంతకాలంగా మంచు కుటుంబం అంటే విమర్శలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి ఈ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే సినిమా విడుదల కాకుండానే సినిమాపై తప్పుడు, నెగిటివిటీని ప్రచారం చేస్తూ సినిమాని ఇబ్బందుల్లో పడేస్తున్నారు. ఈ తరుణంలోనే కన్నప్ప విషయంలో చిత్ర బృందం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కన్నప్ప సినిమా ఎన్నో వివాదాలలో చిక్కుకుందని చెప్పాలి.

ఇలా ఈ వివాదాలన్నింటిని ఎదుర్కొని కన్నప్ప సినిమాను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు అయితే తాజాగా చిత్ర బృందం ఈ సినిమా పట్ల ఎవరైనా తప్పుడు ప్రచారాలకు పాల్పడితే వారి పట్ల తప్పనిసరిగా చర్యలు ఉంటాయి అంటూ హెచ్చరిస్తూ ఒక లేఖ విడుదల చేశారు. సినిమా గురించి దుష్ప్రచారాలు చేసిన తప్పుడు ప్రచారాలు చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని తెలియజేశారు. ఇక ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి సినిమాలో కేవలం మంచు విష్ణు మోహన్ బాబు మాత్రమే కాకుండా ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ వంటి వారందరూ నటించిన నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ అంచనాలను కన్నప్ప చేరుకోగలరా లేదా అనేది మరొక రెండు రోజులలో తెలియనుంది.