Highest Paid Actor : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా కోసం 80 కోట్లు ఆ పైన తీసుకుంటున్నాడట. రామ్ చరణ్ అయితే, ఏకంగా 100 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ప్రభాస్ రెమ్యునరేషన్ 130 కోట్ల వరకూ వుంటుందట. ఇలా రోజుకో కొత్త పుకారు తెరపైకొస్తోంది.
కోటి.. అంటేనే చిన్న విషయం కాదు. అలాంటిది, ఓ హీరోకి 100 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చే పరిస్థితి వుంటుందా.? అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఓ హీరోకి ఇచ్చేస్తే, నిర్మాత సినిమా తెరకెక్కించడానికి ఇంకేం ఖర్చు చేస్తాడు.? ఈ ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల పంచాయితీ నేపథ్యంలో సినిమా హీరోల రెమ్యునరేషన్ల అంశం చర్చకు వస్తోంది. నిజానికి, ఎప్పటికప్పుడు హీరోల రెమ్యునరేషన్ గురించి గాసిప్స్ వస్తాయి. స్టార్ హీరోయిన్లు, స్టార్ డైరెక్టర్ల విషయంలోనే కాదు, స్టార్ కమెడియన్ల విషయంలోనూ ఊహాగానాలు మామూలే.
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే కమెడియన్ ఎవరంటే ఒకప్పుడు బ్రహ్మానందం పేరు వినిపించేది. ఆ తర్వాత సునీల్ గురించి ఇలాంటి ప్రచారాలే విన్నాం. హీరోయిన్లలో అనుష్క అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.
ఇంతకీ, తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటోన్న హీరో ఎవరు.? గాసిప్స్ పరంగా అయితే ప్రభాస్పేరు ముందు వరుసలో వుంది. కానీ, సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం చూస్తే రెమ్యునరేషన్ పరంగా నెంబర్ వన్ హీరో పవన్ కళ్యాణ్.
ఇదిలా వుంటే, తనకు 100 కోట్ల రెమ్యునరేషన్.. అంటూ జరుగుతున్న ప్రచారాన్ని రామ్ చరణ్ ఖండించాడు. ‘నాకు అంత రెమ్యునరేషన్ ఎవరిస్తారు.?’ అని ప్రశ్నించాడు రామ్ చరణ్ తాజాగా.