సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్న ఏపీ మాజీ మంత్రి.. కలెక్టర్ పాత్రలో సందడి చేయనున్న పల్లె?

చూడు కమిషనర్ టై ఉన్నంతవరకే నేను కలెక్టర్… ఒక్కసారి టై తీసానంటే టైగర్.ఈ డైలాగ్ వింటుంటే ఈ డైలాగ్ చెబుతున్న హీరో ఎవరు? ఏ సినిమా అని అందరిలోనూ ఆసక్తి కలుగుతుంది. మరి ఈ డైలాగ్ ఏ సినిమాలోది ఏ హీరో అనే విషయానికి వస్తే…ఈ డైలాగ్ చెబుతున్నది హీరో కాదండోయ్ ఏపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. ఒక విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రఘునాథ్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు.అనంతపురం జిల్లాకు చెందిన ఈయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీగా ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేసే తన మార్క్ చూపించారు.

ఇలా విద్యావేత్తగా రాజకీయ నాయకుడిగా ఎంత గుర్తింపు సంపాదించుకున్న పళ్ళు రఘునాథ్ రెడ్డి తనలో మరో యాంగిల్ కూడా ఉందని నిరూపించుకున్నారు. ఈ క్రమంలోనే తనకు సినిమాలలో నటించే అవకాశం రావడంతో వెంటనే మొహానికి రంగు వేసుకోవడానికి ఈయన సిద్ధమయ్యారు. అనంతపురానికి చెందిన కూరగాయల లక్ష్మీపతి అనే నిర్మాత ఐక్యూ అనే సినిమాని నిర్మిస్తున్నారు.కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకేక్కుతున్న ఈ సినిమా కోసం పల్లె రఘునాథ్ రెడ్డి కాలేజీలో షూటింగ్ కోసం ఆయనను సంప్రదించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ కలెక్టర్ పాత్ర ఉందని అందులో నటించాలని పల్లె రఘునాథ్ రెడ్డి గారిని కోరడంతో వెంటనే ఆయన ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. ఇలా పల్లె రఘునాథ్ రెడ్డి తనలో ఉన్న మూడవ యాంగిల్ కూడా బయట పెట్ట బోతున్నారు. ఇలా కలెక్టర్ పాత్రలో పల్లె రఘునాథ్ రెడ్డి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈయన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయిందని, ఇక ఈయన చెప్పిన ఈ డైలాగ్ వింటేనే తన పాత్ర ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది.