విరాటపర్వం సినిమా పై ప్రశంసలు కురిపించిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు?

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఇటీవల పెళ్లి సందడి అనే సినిమా కూడా తెరకెక్కింది. ఇదిలా ఉండగా ఈయన ప్రస్తుతం విరాటపర్వం సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో..సురేష్ బాబు సమర్పణలో.. ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన సినిమా విరాట పర్వం. ఈ సినిమాలో దగ్గుబాటి రానా సాయి పల్లవి కలిసి నటించారు. సరళ అనే యువతి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రానా రావన్న పాత్రలో నటించగా.. సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటించింది.

ప్రజలకోసం పోరాటం చేస్తున్న రావన్న ప్రేమ పొందటానికి వెన్నెల పడే తాపత్రయం ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించారు. ఇది ఒక మంచి ప్రేమ కథా చిత్రం అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను భావోద్వేగానికి గురి చేస్తోంది. సాధారణ ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా చూసి కంటతడి పెట్టుకున్నారు. 1990 లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సరళ అనే అమ్మాయి జీవితంలో జరిగిన సంఘటనలను వేణు చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈనెల 17వ తేదీన విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ విరాటపర్వం సినిమా చూసిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా సినిమా గురించి స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కుర్రవాడైనా వేణు ఊడుగుల దర్శకత్వం చాలా అద్భుతంగా ఉంది. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా ఈ సినిమా చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో రానా, సాయి పల్లవి చాలా బాగా నటించారు. మస్ట్ వాచ్ ఫిల్మ్ అంటూ సినిమా మీద ప్రశంశలు కురిపించారు. ఇక తాజాగా విరాట పర్వం సినిమా టీమ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ సినిమా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సినీ ప్రముఖులకు ధన్యవాదాలు తెలియజేశారు.