అప్పట్లో బాబు అలా ..ఇప్పట్లో జగన్ ఇలా

cm jagan babu telugu rajyam

 ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. తన ఐదేళ్ల పదవి కాలం పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఎన్నికైయ్యారు. కాబట్టి ఇద్దరి పరిపాలన దక్షతను పక్కపక్కన పెట్టి చూడటం అనేది సహజం. తాజాగా సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ తో నదీజలాల విషయంలో వాదనలు పెట్టుకోవటంతో మరోసారి జగన్ చంద్రబాబు పనితీరుపై చర్చలు నడుస్తున్నాయి.

kcr babu jagan telugu rajyam

 

 గతంలో కూడా చంద్రబాబుకు కేసీఆర్ కు మధ్య వైరం నడిచింది, కాకపోతే రాష్ట్రప్రయోజనాలు కంటే కూడా వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే లను కొనటానికి బాబు సిద్ధంకావటం, రేవంత్ రెడ్డి తో సహా బాబు మాట్లాడిన మాటలు బయటకు రావటంతో రచ్చ మొదలైంది. అప్పటినుండి కేసీఆర్ తో వైరం మరింత ముదిరి చివరకు పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసుకొని తట్టాబుట్ట సర్దుకొని శంకరగిరి మాన్యాలు పట్టుకొని వెళ్లినట్లు బాబు అమరావతికి వెళ్ళిపోయాడు. కానీ నేడు సీఎం జగన్ కేవలం సొంత రాష్ట్ర ప్రయోజనాల కోసమే తనకు మిత్రుడైన కేసీఆర్ తో వాదనలకు దిగాడు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేరోజు కేసీఆర్ స్వయంగా వచ్చాడు. ఆ తర్వాత జగన్ కూడా అనేకసార్లు ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ ని కలిసి తమ మధ్యనున్న స్నేహాన్ని మరింత పదిలం చేసుకున్నాడు, కానీ నేడు రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగత స్నేహాన్ని కూడా పక్కన పెట్టి పోరాటం చేస్తున్నాడు జగన్.

  చంద్రబాబు మాదిరి కుట్రపూరితంగా రాజకీయాలు చేసి వైరం తెచ్చుకోలేదు. ఇదే ఇద్దరి మధ్యనున్న ప్రధానమైన తేడాగా రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. చంద్రబాబు మాదిరి లేనిది ఉన్నట్లు చెప్పుకోవటం, డబ్బాలు కొట్టుకోవటం లాంటివి సీఎం జగన్ చేయటం లేదు. ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో ఆ పాయింట్ మాత్రమే సరిగ్గా మాట్లాడుతున్నాడు జగన్. వేదిక ఎక్కి మాట్లాడకుండా, దిగి సొల్లు మాట్లాడటం వలన ఎలాంటి లాభం లేదు. గతంలో బాబు ఇలాగే వ్యవహరించేవాడు. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన సమావేశాల్లో పెద్దగా మాట్లాడలేని బాబు, తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి అహో ఓహో అంటూ గొప్పలు చెప్పుకునే వాడు, కానీ నేడు జగన్ వాటికీ బిన్నంగా రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన ధేయ్యంగా ముందుకు సాగుతున్నాడు