హీరోయిన్ గా మారనున్న ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూతురు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది డాన్స్ కొరియోగ్రాఫర్ లో ఉన్నప్పటికీ శేఖర్ మాస్టర్ కి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో ఢీ షో కి జడ్జ్ గా ఎదిగాడు. ఇలా టివి లో ప్రసారమైన ఎన్నో టీవీ షోస్ లో జడ్జ్ గా వ్యవహరించి బుల్లితెరపేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో కొరియోగ్రఫీ చేసే అవకాశాలను దక్కించుకున్నాడు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ ఇండస్ట్రీలో పాపులర్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందాడు.

స్టార్ హీరో సినిమా అంటే శేఖర్ మాస్టర్ డాన్స్ కచ్చితంగా ఉండాలని హీరోలే అడిగి మరి శేఖర్ మాష్టర్ ని పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా శేఖర్ మాష్టర్ పిల్లలు విన్ని, సాహితి గురించి కూడా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. మీరు కూడా టెలివిజన్ లో ప్రసారమైన ఎన్నో టీవీ షోస్ లో సందడి చేస్తున్నారు. సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అద్భుతమైన డాన్స్ లు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇది ఎలా ఉండగా గత కొన్ని రోజులుగా శేఖర్ మాస్టర్ కూతురు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

ఎంతో అందంగా కుందనపు బొమ్మలా ఉండే శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక కొత్త దర్శకుడు శేఖర్ మాస్టర్ కి స్టోరీని వినిపించగా కథ నచ్చడంతో శేఖర్ మాస్టర్ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో హీరో కోసం శేఖర్ మాస్టర్ దగ్గరుండి మరి ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కోసం సెర్చింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే గత కొంతకాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ వార్తల గురించి శేఖర్ మాస్టర్ ఎక్కడ స్పందించలేదు. దీంతో ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.