అయినవాళ్లను నమ్మి కోట్ల రూపాయలు నష్టపోయిన నటి..?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన వాళ్ళు ఎంతో కష్టపడుతూ అవకాశాలను దక్కించుకొని ఇండస్ట్రీలో నటిస్తూ కోట్ల రూపాయల డబ్బును సంపాదిస్తూ ఉంటారు. అయితే వారు సంపాదించినది మొత్తం ఇతరులపై గుడ్డి నమ్మకంతో తమ ఆస్తులను మొత్తం వారి చేతుల్లో పెట్టి చివరికి దారుణమైన పరిస్థితులను అనుభవించాల్సి వస్తోంది.ఇలా ఇప్పటికే ఎంతోమంది సినీ తారలు ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తూ చివరి రోజులలో ఎంతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు.

ఈ క్రమంలోనే శృంగార తారగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నటి షకీలా కూడా అయిన వాళ్లను నమ్మి కోట్ల రూపాయల నష్టపోయింది. ఆమెకు సినిమాలలో నటించడం ఇష్టం లేకపోయినా తన తల్లి బలవంతంతో ఇండస్ట్రీలోకి వచ్చిన షకీలా ఇండస్ట్రీలో శృంగార తారగా పేరు సంపాదించుకొని వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండిపోయారు.ఒకానొక సమయంలో ఈమె సినిమాలు విడుదల అవుతున్నాయని తెలియగానే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. ఇలా ఇండస్ట్రీలో ఈమె సినిమాలు వస్తున్నాయంటే అభిమానులు కూడా ఈమెను చూడటానికి మాత్రమే థియేటర్లకు తరలి వచ్చేవాళ్ళు.

ఇలా ఇండస్ట్రీలో కోట్ల రూపాయలు సంపాదించిన షకీలా తన ఆస్తిపాస్తులను చూసి తన కుటుంబ సభ్యులు ఈర్ష పెంచుకున్నారు.ఈ క్రమంలోనే తన అక్కయ్య నీ దగ్గర అన్ని డబ్బులు ఉంటే ఇన్కమ్ టాక్స్ రైడ్ జరుగుతుంది కనుక ఆ డబ్బును నాకు ఇవ్వు భద్రంగా ఉంచుతానని తన దగ్గర నుంచి ఏకంగా రెండు కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నారు. అప్పట్లో రెండు కోట్ల అంటే మామూలు విషయం కాదు. ఇలా తన రెండు కోట్ల రూపాయలు తన చేతిలో పెడితే చివరికి అక్క తన దగ్గర రూపాయి కూడా లేదంటూ దారుణంగా తనని మోసం చేసింది. ఇక ఈ విషయంపై పోలీస్ కేసు పెడదామన్న కుటుంబ పరువు పోతుందన్న ఉద్దేశంతో ఈమె సంపాదించినది మొత్తం ఇతరులకు దార పోసి ప్రస్తుతం అవకాశాలు లేక పలు టీవీ కార్యక్రమాలు చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు.