Raja Sree: బంగార్రాజు సినిమా సెట్లో నాగార్జున గారు ఎలా ఉండేవారంటే..అంటూ నాగార్జున వ్యక్తిత్వాన్ని బయటపెట్టిన నటి!

Raja Sree: తను సినిమాల్లో చేయడానికి తన తల్లిదండ్రుల కంటే తన భర్త ఎక్కువ ప్రోత్సహిస్తారని ప్రముఖ నటి రాజశ్రీ నాయర్ అన్నారు. ఇక తనకు మదర్ గా చేసేందుకు అవకాశం వచ్చినప్పుడు తాను ఆ క్యారెక్టర్ చేయాలా వద్దా అని పలుమార్లు ఆలోచించానని ఆమె అన్నారు. ఆ సమయంలో తన భర్తని సలహా అడిగినప్పుడు ఏంటి ఈ సమయంలో హీరోస్ దగ్గరికెళ్ళి హగ్ చేసుకుంటావా అని కామెడీగా అన్నట్టు ఆమె తెలిపారు. కానీ మదర్ గా యాక్ట్ చేస్తున్నప్పుడు హీరోయిన్ కంటే ఎక్కువ సార్లు వేరే వాళ్ళని హగ్ చేసుకోవాల్సి వచ్చిందని ఆమె నవ్వుతూ చెప్పారు.

కానీ ఇప్పటి వరకూ ఎంతోమంది అగ్ర హీరోలు హీరోయిన్లతో కలిసి నటించారని రాజశ్రీ నాయర్ అన్నారు. ఇక నాగార్జున గురించి ఆమె చెబుతూ ఆయన ఎంతో నిజాయితీగా ఉంటారని మోడెస్ట్ అని ఆమె అన్నారు. అంతే కాకుండా ఆయన సెట్లో అందరి దగ్గరకు వెళ్లి మాట్లాడతారని, ఎంతో కంఫర్టబుల్ గా ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు. అవతలి వాళ్ళు కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అయినట్టు ఆయన పక్కనే కూర్చుని మాట్లాడటం అనేది చాలా పెద్ద విషయంగా కనిపిస్తుంది అని రాజశ్రీ నాయర్ అన్నారు. అందుకే సెట్లో నాగార్జున గారు వచ్చారంటే అందరు ఇలా చూస్తుంటారని ఆమె చెప్పారు.

ప్రస్తుతం నాగార్జున నాగచైతన్య కలిసి నటిస్తున్న బంగార్రాజు చిత్రంలో హీరోయిన్ కృతి శెట్టి తల్లి పాత్రలో నటిస్తున్నానని ఈ సందర్భంగా రాజశ్రీ నాయర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగార్జున వ్యక్తిత్వం గురించి తెలియజేశారు. ప్రస్తుతం ఈమె బుల్లితెరపై వెండితెర పై పలు సీరియల్స్, సినిమాలలో చేస్తూ బిజీగా గడుపుతున్నారు