నా టీమ్ లో నుంచి హైపర్ ఆది వెళ్లి పోవడానికి అసలు కారణం అదే: అదిరే అభి

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. అలా జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అదిరే అభి కూడా ఒకరు. వెండితెర పై పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించినప్పటికీ రాని గుర్తింపు టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి కమెడియన్ గా మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అదిరే అభి తనతో పాటు మరికొంతమంది కూడా అవకాశాన్ని ఇచ్చాడు. అలా అభి ద్వారా సక్సెస్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.

మొదట అభి టీం లో చేసిన హైపర్ ఆది ఆ తర్వాత వెళ్లి ఒక టీము ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. హైపర్ ఆది అలా అభి టీమ్ ను వదిలి వెళ్లి వేరే టీమ్ ఎందుకు ఏర్పాటు చేసేందుకు చేసుకోవాల్సి వచ్చిదో తాజాగా వివరణ ఇచ్చారు అభి. అదిరే అభి జబర్దస్త్ షో ద్వారా మంచి సక్సెస్ ను అందుకున్న తర్వాత కొత్తవారికి చాలా తక్కువగా అవకాశాలు ఇచ్చాడట. అంతేకాకుండా చాలామంది ఖాళీగా ఉంటున్న వారికి కూడా తన స్కిట్ లో నటించే అవకాశాన్ని కూడా ఇచ్చినట్లు తెలిపారు అదిరే అభి. ఆ విషయంలో తనకి చాలామంది నుంచి ప్రశంసలు దక్కాయి తెలిపారు.

ఇక ప్రస్తుతం జబర్దస్త్ లో టాప్ కమెడియన్ గా కొనసాగుతున్న వారిలో హైపర్ ఆది ఒకరు. అయితే అతను షో లోకి రావడానికి ముఖ్య కారణం అదిరే అభి అన్న విషయం తెలిసిందే. మొదట అభి గ్రూప్ లోనే కొనసాగుతూ వచ్చిన హైపర్ ఆది స్క్రిప్ట్ రైటర్ గా కూడా కొన్నాళ్ళు వర్క్ చేశాడు. అయితే అభి వాళ్ళు రోజు స్కిట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మధ్యలో వచ్చి తనదైన శైలిలో కొన్ని సలహాలు ఇస్తూ ఉండేవాడని ఆ తర్వాత అతన్ని పనితనం నచ్చే స్క్రిప్ట్ రైటర్ కూడా పెట్టుకున్నట్లు తెలిపాడు అభి. దీంతో ప్రతి రోజు అలా స్క్రిప్టు అద్భుతంగా రాస్తూ ఉండటంతో ఆది నీ తన టీంలో ఒక కమెడియన్ గా చేర్చుకున్నాడట. అయితే ఆది నా గ్రూప్ నుంచి బయటకు వెళ్లి మరో గ్రూపు పెట్టడానికి విభేదాలు ఏమి కారణం కాదని, జబర్దస్త్ దర్శకులు మరొక గ్రూప్ కావాలి అని అడగడంతో అప్పుడు ఆదిని సంప్రదించారట, అయితే ఆ సమయంలో తాను కూడా ఆదికి ఫుల్ సపోర్ట్ చేశాను అని తెలిపాడు అభి.