బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై నటిగా కూడా ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే వెండితెరపై పలు సినిమాలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న అనసూయ తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు. ఇలా ఈమె జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్లడంతో ఎంతోమంది ఎన్నో రకాల కారణాలను బయటికి తీశారు. అయితే తనకు జబర్దస్త్ కన్నా స్టార్ మా అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వటం వల్ల తాను స్టార్ మా కు వెళ్ళిందని వార్తలు వినపడుతున్నాయి.
ఇలా అనసూయ జబర్దస్త్ మానేయడం గురించి ఈ విధమైనటువంటి వార్తలు తెరపైకి రావడంతో అనసూయ ఈ వార్తలపై స్పందిస్తూ పరోక్షంగా కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఖాతా ద్వారా అనసూయ స్పందిస్తూ. కొన్నిసార్లు మీరు ఉపయోగించిన, మీకు అలవాటైన ప్రదేశం ఎప్పటికీ మీది కాదని గుర్తుంచుకోండి.. ఎప్పటికీ ఆస్థానం మన సొంతం కాదు అంటూ ఈమె పరోక్షంగా తాను జబర్దస్త్ కార్యక్రమంలోని కొనసాగాలని లేదు అంటూ వెల్లడించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అనసూయ జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.అదేవిధంగా అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్న అనసూయ వెబ్ సిరీస్లలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈమె కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ లో ఒక వేశ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.