Jaya vaani: నటి జయవాణి ఈ మధ్య కాలంలో వరుస ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్నో విషయాలను బయట ఈ క్రమంలోనే జయవాణి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…తనతో నటించిన కో ఆర్టిస్ట్‌లు కూడా తనకు సపోర్ట్ చేశారని, వేరే సినిమాల్లో చేసేందుకు రికమెండ్ కూడా చేశారని నటి జయవాణి అన్నారు. కానీ అక్కడ మాట సాయం మాత్రమే ఉంటుందని అవకాశం రావచ్చు, రాకపోనూ వచ్చు అని ఆమె తెలిపారు.
ఇకపోతే ప్రముఖ దర్శకుడు వివి.వినాయక్ ఓ సినిమాలో క్యారెక్టర్ కోసం డేట్స్ అడిగితే ఇవ్వలేదని తనపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె చెప్పుకొచ్చారు. అసలేమైందంటే తనను డేట్స్ అడిగిన మాట వాస్తవమే. అయితే ఒక డేట్ చెప్పారు గానీ ఆ రోజు వచ్చే సరికి ఎలాంటి స్పందనా రాకపోయేసరికి తానే వాళ్లను సంప్రదించినట్టు ఆమె తెలిపారు. అప్పుడు వాళ్లు ఏమన్నారంటే, మీరు రెమ్యునరేషన్ ఎక్కువ అడిగారంట కదా అని అన్నట్టు ఆమె అన్నారు. తాను అసలు రెమ్యునరేషన్ ఎక్కువ అడగలేదని, అసలు ఎవరు ఆ మాట ఎవరో తనకు చెప్పారని అన్నట్టు ఆమె అన్నారు. ఎందుకంటే దాని కంటే ముందు తాను క్యారెక్టర్‌కే ఎక్కువ విలువ ఇస్తానన్న ఆమె, అలా అని తక్కువ పేమెంట్ కూడా తీసుకోనని ఆమె స్పష్టం చేశారు.
ఒక్క మాటలో చెప్పాలంటే తన అహం దెబ్బతినకుండా, తనకు ఎంతైతే సంతృప్తికరంగా ఉంటుందో అంతే తీసుకుంటా గానీ, మరీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తీసుకున్నంత తక్కువ మాత్రం ఇప్పుడు తాను తీసుకోనని ఆమె అన్నారు. ఆయనకే కాదు ఇంకెవరికీ కూడా ఇప్పటివరకు ఇంత అమౌంట్ ఇస్తేనే ఈ పాత్ర తాను చేస్తానని కూడా ఎవరితోనూ అనలేదని ఆమె వివరించారు. ఒక వేళ అలా ఏమైనా చెప్పాను అంటే తనకు ఇష్టంలేని అంటే బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం అలాంటి సందర్భం వచ్చినపుడు చెప్తానని ఆమె అన్నారు. అది కూడా డైరెక్టర్ ఒకవేళ తానే ఈ పాత్ర చేయాలని డిమాండ్ చేస్తే.. అప్పుడు తాను చెప్తానని జయవాణి చెప్పారు