పూరీ జగన్ భారీ సినిమాలో పూజా హెగ్డే? సరైన క్లారిటీ ఇదే.!

Pooja Hegde With Puri

Pooja Hegde With Puri : గత కొన్నాళ్ల కితం వరకు సౌత్ ఇండియన్ సినిమా దగ్గర గోల్డెన్ లెగ్ గా పిలవబడే స్టార్ హీరోయిన్ లలో డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కూడా ఒకామె. అయితే ఇప్పుడు మళ్ళీ పూజా హెగ్డే పరిస్థితి అసలేం బాగోలేదు. దీనితో ఈమె సినిమా అంటే ప్లాప్ అనే ముద్ర బాగా పడిపోయింది.

లేటెస్ట్ గా “ఆచార్య” తో అయితే అంతా ఫిక్స్ అయ్యిపోయారు కూడా. ఇక ఇదిలా ఉండగా ఇన్ని ప్లాప్ లు వస్తున్నా కూడా పూజా కి ఉన్న డిమాండ్ గాని చెయ్యబోయే సినిమాలు లిస్ట్ గాని ఏమాత్రం తగ్గలేదు. అలా ఇప్పుడు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ల సినిమాలు ఆల్రెడీ లైనప్ లో ఉండగా..

మరో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో కూడా సినిమా చేస్తుందని ఆ మధ్య టాక్ వచ్చింది. మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో చేయబోయే మరో భారీ పాన్ ఇండియా సినిమా “జనగణమన” కి ఆమె పేరు వినిపించింది. అయితే ఈ సినిమాలో ఈమె నటించబోతుంది అని వస్తున్న మాట నిజమే అన్నట్టుగా ఇప్పుడు నేషనల్ మీడియా వర్గాలు కన్ఫర్మ్ చేసాయి.

ఈమె ఈ సినిమాకి కూడా ఓకే చెప్పింది అని దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ కూడా రాబోతుందని టాక్. మొత్తానికి అయితే ఈ హీరోయిన్ వరుస ఆఫర్స్ తో మాత్రం ఎక్కడా తగ్గదేలే అనిపిస్తుంది..