Radhe Shyam : ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా దగ్గర మాత్రమే కాకుండా మొత్తం సౌత్ ఇండియన్ సినిమా దగ్గరే సంగీత దర్శకుడు థమన్ ఎస్ ఎస్ పేరు ఒక సెన్సేషన్. ప్రతీ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కూడా మేకర్స్ అందిస్తున్నాడు. అలా పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన “రాధే శ్యామ్” సినిమాకి కూడా సంగీతం ఇస్తున్నాడని ఒక రెండు మూడు వారాల కితం నుంచి రూమర్స్ స్ప్రెడ్ అవుతూ వచ్చాయి.
అయితే ఈ గాసిప్స్ ప్రకారం థమన్ ఈ సినిమా ట్రైలర్ కి సంగీతం ఇచ్చాడని సారాంశం. కానీ ఇప్పుడు దీనిపై థమన్ అధికారికంగా ఓపెన్ అయ్యి క్లారిటీ ఇచ్చాడు. తాను రాధే శ్యామ్ సినిమాకే కాదు అసలు ఏ సినిమాకి కూడా వర్క్ చెయ్యడం లేదని క్లారిటీ ఇచ్చేసాడు. అయితే గత కొన్ని రోజులు కితం థమన్ ఇచ్చిన స్టేట్మెంట్ గుర్తు వస్తుంది.
కొన్ని సినిమాలకు ఎలా అయ్యింది అంటే ఒక్కో సాంగ్ కి ఒక్కో సంగీత దర్శకుడు చెయ్యడం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెయ్యడం ఇలాంటివి అన్నీ పెళ్లి ఒక్కడితో శోభనం ఒక్కడితో అన్నట్టు ఉందని చెప్పాడు. అందుకే ఇక నుంచి థమన్ అలంటి వర్క్స్ చెయ్యకూడదు అనుకున్నాడో ఏమో మరి. అయితే గతంలో ఇదే థమన్ “సాహో” మేకింగ్ వీడియోకి అదిరే మ్యూజిక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.