Tamila Sai: సాధారణ అమ్మాయిల నుంచి హీరోయిన్ ల వరకు ప్రతి ఒక్క మహిళ కూడా బాడీ షేమింగ్ ఎదుర్కొంటూ ఉంటారు అన్న విషయం అందరికి తెలిసిందే. అమ్మాయిలు చూడడానికి బాగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, ముట్టుకుంటే మాసిపోవాలీ, పట్టుకుంటే కంది పోవాలి ఇలా ఎన్నో రకాలుగా ఎంతోమంది హేళన చేస్తూ ఉంటారు. హీరోయిన్స్ విషయమైతే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్లను అందంగా లేదు అంటూ, మూతి వంకర, ముక్కుసూటి, నల్లగా ఉంది ఇలా హీరోయిన్ లు కూడా బాడీ షేమింగ్ విషయంలో ఎన్నో రకాల అవమానాలు భరిస్తూ ఉంటారు.
అయితే ఆ మాటలు ఎంత బాధ కలిగిస్తాయి అన్నది బాధపడిన వారికే తెలుస్తుంది అంటున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. సాధారణ మహిళ తో పాటు తాను కూడా బాడీ షేమింగ్ ఎదుర్కొన్నాను అని తెలుపుతూ ఆమె ఎమోషనల్ అయ్యింది. ఇటీవలే విడుదల అయిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో సాయి పల్లవి డాన్స్ అండ్ నటన అద్భుతంగా ఉన్నాయి అని ప్రశంసిస్తూనే ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ విమర్శించారు. ఇదే విషయంపై తాజాగా తమిళిసై తనదైన రీతిలో స్పందించింది. తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అని మాట్లాడుతూ..
నేను కూడా బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నాను.. నల్లగా ఉన్నానని పొట్టిగా ఉన్నానని చాలా మంది నన్ను ఏడిపించే వారు.. వారు అన్న మాటలకు నేను ఎంతో బాధపడ్డాను.. అయినప్పటికీ ఎవరు ఎన్ని మాటలు అన్న వాటన్నింటినీ తట్టుకుని నిలబడి గాను.. అదేవిధంగా ఎవరు ఏమి అన్నా పట్టించుకోకుండా బాధ పడకుండా ఉండటానికి మనం మహాత్ములను కాదు.. అలాగే నల్లగా పొట్టిగా ఉండటం నా తప్పు కాదు.. చూపులను బట్టి అందం ఉంటుంది అని చెప్పుకొచ్చింది తమిళిసై. అదే విధంగా తెలుగులో ఒక సామెత ఉంది.. కోడి పిల్ల కోడి కి ముద్దు అని అంటారు.. కోడి పిల్ల ఎలా ఉన్నా కూడా తన తల్లికి బంగారంలానే కనిపిస్తుంది.. అంటూ ఘాటుగా స్పందించింది తమిళిసై. అలాగే ఎక్కువగా స్త్రీలే బాడి షేమింగ్ కు గురవుతున్నారు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.