తెలంగాణ  గ‌వ‌ర్నర్ తమిళిసై సౌంద‌ర‌రాజ‌న్ కీల‌క వ్యాఖ్యలు

tamilisai telugu rajyam

తెలుగు సంవ‌త్సరాది ఉగాది సందర్భంగా తెలంగాణ  గ‌వ‌ర్నర్ తమిళిసై సౌంద‌ర‌రాజ‌న్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఉగాదిని పుర‌స్కరించుకుని రాజ్ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గోన్న త‌మిళిసై పలు వ్యాఖ్యలుచేశారు. రాజ్ భ‌వ‌న్ ప‌రిధి త‌న‌కు తెలుసని, త‌న‌ను ఎవ‌రూ నియంత్రించ‌లేర‌న్నారు. త‌న‌కు ఇగో లేద‌ని కూడా ఆమె తేల్చి చెప్పారు.
వ‌చ్చే నెలలో రాజ్ భ‌వ‌న్‌లో ప్రజా ద‌ర్బార్ నిర్వహించనున్నట్లు ప్రక‌టించారు. ఇక నేరుగా ప్రజ‌ల‌ను క‌లుస్తాన‌ని వెల్లడించారు. ప్రజల కోసం రాజ్ భ‌వ‌న్ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించారు.