TG: లిస్టులో పేర్లు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినట్టేనా… డిప్యూటీ సీఎం భట్టి సంచలన వ్యాఖ్యలు!

TG: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా 6 గ్యారంటీలను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీలను ఇవ్వలేకపోయింది ఈ క్రమంలోనే నేడు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు.

కేబినెట్ సమావేశంలో భాగంగా కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాలుగు పథకాలను అమలు చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు భట్టి తెలిపారు.ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేయనున్నారు.

ఈ పథకాల అమలు కోసం గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున గ్రామసభలను ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే ఎవరైతే అర్హతలు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకాలను అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ గ్రామసభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికారులు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఓ లిస్టు విడుదల చేయగా.. లిస్టులో పేరు లేదంటూ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. తమకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లిస్టులో పేరు మాత్రం లేదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరికొన్ని గ్రామసభలలో ఏకంగా ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు ఇలాంటి తరుణంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామసభ లిస్టులో పేరు వచ్చినంత మాత్రాన ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు వచ్చినట్లు కాదన్నారు. ఆ లిస్టులో ఉన్నది దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు మాత్రమేనని చెప్పారు. ఇంకా ఎవరైనా అప్లయ్ చేసుకోని వారుంటే వారు కూడా అప్లయ్ చేసుకుంటారనే ఉద్దేశ్యంతో ఈ లిస్ట్ విడుదల చేసామని తెలిపారు .అయితే లిస్టులో ఉన్న వారిలో ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఈ పథకాలు వస్తాయని అర్హత లేని వారికి పథకాలు రావు అంటూ భట్టి విక్రమార్క తెలియజేశారు.