హత్రాస్ వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు… సోషల్ మీడియాలో విమర్శలు

uttam revanth telugu rajyam

 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ కేసు అనేక మలుపులు తిరిగి చివరకు సిబిఐ వాళ్ళ దగ్గరకి వచ్చింది. ఈ కేసు సిబిఐ కి రావటానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేసిన పోరాటమే అని చెప్పాలి. వాళ్ళు బాధిత కుటుంబాన్ని మొదటి సారి పరామర్శించటానికి వెళ్ళినప్పుడు జరిగిన పరిణామాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ జరిగింది. ఆ తర్వాత రెండోసారి పరామర్శించిన కొద్దీ గంటల్లోనే కేసు సిబిఐ కి చేరింది.

uttam revanth telugu rajyam

 ఇక అసలు విషయానికి వస్తే రాహుల్ గాంధీ, ప్రియాంక లు రెండోసారి హత్రాస్ వెళ్లే సమయంలో వాళ్ళకి మద్దతుగా తెలంగాణ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా వెళ్ళటం జరిగింది. అయితే వాళ్ళు బాధిత కుటుంబాన్ని కలుసుకోవటం కుదరకపోవడంతో వెనక్కి వచ్చారు. అయితే ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఆల్రెడీ అక్కడికి వెళ్లారు. వాళ్ళకే అనుమతి లేదు. మరి వీళ్ళు ఇక్కడ నుండి వెళ్ళటం అవసరమా..? అసలు తెలంగాణ లో ఇలాంటి ఏమైనా జరిగితే పెద్దగా రియాక్ట్ కానీ నేతలు హత్రాస్ వెళ్ళటం ఏమిటో..

  గత రెండు రోజుల క్రితం పాతబస్తీ పరిసరాల్లో ఎంఐఎం కార్యకర్తలుగా భావిస్తున్న వాళ్ళు ఒక యువతిని రేప్ చేసిన సంఘటనలో మాట్లాడటానికి దైర్యం లేదు కానీ, హత్రాస్ వెళ్లి వచ్చారు అంటూ కొందరు వ్యంగంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. సమస్యల మీద పోరాటం చేయాలంటే తెలంగాణ లోనే అనేక సమస్యలు ఉన్నాయని ముందు వాటిపై దృష్టి పెట్టాడంటూ మరికొందరు విసుర్లు విసురుతున్నారు. అసలు వాళ్ళ పార్టీలోనే సరైన ఐక్యమత్యం లేదని, అలాంటి నేతలు ప్రజా సమస్యలపై ఏమని పోరాటాలు చేయగలరు, ముందు పార్టీలోని సమస్యలను పరిష్కరించుకోమను అంటూ కాంగ్రెస్ కి చురకులు అంటిస్తున్నారు. మరి ఈ విషయాలు కాంగ్రెస్ నేతల దృష్టికి వెళ్లిందో లేదో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం కాంగ్రెస్ నేతలను ఒక ఆట ఆడుకుంటున్నారు.