తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాని కట్టడి చేయడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆ మధ్య తీవ్రంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ర్టంలో కరోనా విలయతాండవం చేస్తోన్న సమయంలో కేసీఆర్ ప్రగతి భవన్ కు రాకుండా సొంత ఫామ్ హౌస్ లో కూర్చున్నారని..అక్కడ నుంచి పాలన సాగిస్తున్నారని…ఆయన ఆరోగ్యం బాగోలేదని పలు ఆరోపణల్ని తెరపైకి తీసుకొచ్చి విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో కార్పోరేటు ఆసుపత్రులు కరోనా పేరుతో లక్షల రూపాయాలు దోచేయడం.. ప్రభుత్వం తక్కువగా పరీక్షలు చేయడం..ఫలితాలు వెల్లడించడంలో జాప్యం చేస్తోందని..కేసుల సంఖ్య..మరణాలు సంఖ్య దాచేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెద్బ తీసేలా చేస్తున్నారని చాలా విమర్శలు తెరపైకి వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే హైకోర్టు నుంచి తెలంగాణ సర్కార్ కి చుక్కెదురైన సంగతి తెలిసిందే. యంత్రాంగం విఫలమైందని..పరీక్షలు ఎందుకు పెంచడం లేదని..కేసులు ఎందుకు దాచేస్తున్నారని..వెంటనే వాటి వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఆదేశాలివ్వడం..దానిపై విచారణలు జరగడం గురించి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తాయి. తాజాగా వాటన్నింటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తనదైన శైలిలో బధులిచ్చారు. కరోనా విషయంలో ప్రభుత్వం నిరంతరం పనిచేసిందని..అందుకే రోజుకు రెండు వేలకు మించి కేసుల సంఖ్య పెరగలేదన్నారు. ఉచితంగా వైద్యం సహా కరోనా సోకిన రోగుల పట్ల ప్రభుత్వం మంచి సేవలు అందిస్తుందన్నారు.
మరణాల సంఖ్య తక్కువగానే ఉందన్నారు. ప్రతిపక్షం కావాలనే ఆరోపణలు చేస్తుందని..కేసీఆర్ ఇంకా బ్రతికే ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపై కూడా మరోసారి నిప్పులు చెరిగారు. ఆయుష్మాన్ పథకం మన రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆరోగ్య శ్రీ పథకం ముందు ఎందుకు పనికి రాదని ఎద్దేవా చేసారు. ఆ పథకాన్ని అమలు చేస్తోన్న రాష్ర్టాలు ఎన్ని ఇబ్బందలు పడుతున్నాయో తెలుసునన్నారు. ఆరోగ్యం శ్రీ పథకం..108 సేవల్ని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని..ఆ పథకం ఎంతో మందికి ఉపయోగపడిందో తెలిసే తాను తెలంగాణలో ఆరోగ్యశ్రీని కొనసాగిస్తున్నాన్నారు. ఎవరు మంచి కార్యక్రమం చేసినా దాన్ని పొగిడే వ్యక్తిత్వం గలవాడినని సీఎం కేసీఆర్ తెలిపారు.