TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై ఇటీవల పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే .ఈయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజు నోటీసులు జారీ చేసింది అయినప్పటికీ కూడా ఈయన ఏమాత్రం తన తీరును మార్చుకొని నేపథ్యంలో సస్పెన్షన్ వేటు వేశారు .
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న దూరం కాగా బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈయనని సస్పెండ్ చేయడంతో ఈయన బీసీల అందరిని ఏకం చేస్తూ సరికొత్త పార్టీని పెట్టబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఇటీవల ఈయన మాత్రం బీఆర్ఎస్ నేతను తెగ పొగిడేయడంతో మరోసారి పెద్ద ఎత్తున రాజకీయపరంగా చర్చలు మొదలయ్యాయి.
తీన్మార్ మల్లన్న రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత గురించి ప్రశంసలు కురిపిస్తూ వరుస వీడియోలను విడుదల చేస్తున్నారు. మల్లన్న టీంలో పని చేస్తే ముగ్గురు ఇలా వరుసగా బీఆర్ఎస్ నాయకులపై పొగుడుతూ వీడియోలు చేయడంతో గులాబీ పార్టీ వీటిని అవకాశంగా తీసుకొని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
ఇక ఈ వీడియోలు చూసిన పలువురు నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు తీన్మార్ మల్లన్న దగ్గర ఇన్ని వేషాలు ఉన్నాయా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉండి కెసిఆర్ కుటుంబాన్ని తిట్టిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు బయటికి రాగానే మళ్లీ.. కల్వకుంట్ల కుటుంబాన్ని… పొగుడుతున్నాడని కొంతమంది ఫైర్ అవుతున్నారు. ఈయన వ్యవహారం చూస్తుంటే అతి త్వరలోనే గులాబీ పార్టీ చెంతన చేరబోతున్నారని తెలుస్తోంది.