టీజర్ టాక్ : ఈసారి ఊహించని డోస్ తో “హిట్” థ్రిల్.!

టాలీవుడ్ నుంచి ఇటీవల కాలంలో ఎక్కువ థ్రిల్లర్ హిట్ సినిమాలు వచ్చాయని చెప్పాలి. మరి ఈ చిత్రాల్లో అయితే ఎక్కువగా యువ దర్శకులు చేసిన సినిమాలే ఎక్కువ కూడా ఉన్నాయి. అలా కొత్త డైరెక్టర్ మాస్ హీరో విశ్వక్ సేన్ తో చేసిన చిత్రం “హిట్” కూడా ఒకటి.

మరి ఈ సినిమా అప్పుడు థియేటర్స్ లో ఉన్నది కొంత కాలమే అయినా సినిమా టైటిల్ కి తగ్గట్టుగా హిట్ గానే నిలిచింది. ఇక దీనితో అయితే ఈ సినిమా నుంచి రెండో సినిమా కూడా ఉందని అనౌన్స్ చేయడం ఆడియెన్స్ లో మరింత ఆసక్తి అయితే రేపింది.

మరి ఈ చిత్రంలో అడివి శేష్ హీరోగా నటించగా ఈ కొత్త థ్రిల్లర్ ప్రాజెక్ట్ నుంచి అయితే మేకర్స్ ఇప్పుడు సాలీడ్ టీజర్ కట్ ని రిలీజ్ చేశారు. మరి ఈ టీజర్ తో ఊహించని డోస్ అందించారని చెప్పాలి. ముందు అంతా చాలా కాజువల్ నరేషన్ లోనే సినిమా కనిపించింది కానీ చివరి 20, 30 సెకండ్స్ లో అయితే సినిమా ఏ లెవెల్లో ఉండబోతుందో అర్ధం అయ్యిపోయింది.

ఒక అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికేసి ఒకేదగ్గర ఆ పార్టులు పెట్టడం ఆడియెన్స్ లో షాకింగ్ గా ఒకింత థ్రిల్లింగ్ గా అనిపించక మానదు. దీనితో అయితే డైరెక్టర్ శైలేష్ మరింత ట్రీట్ ఇవ్వనున్నాడని చెప్పాలి. అలాగే ఈసారి ఓ సైకో పాత్రని కూడా యాడ్ చెయ్యడం సినిమాలో ఆసక్తి రేపుతోంది.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ డిసెంబర్ 2 వరకు ఆగాల్సిందే. ఈ సినిమాని అయితే నాచురల్ స్టార్ నాని నిర్మాణం వహించాడు. 
HIT 2 Teaser | Adivi Sesh | Nani | Sailesh Kolanu | Wall Poster Cinema