2019 ఎన్నికలకు సమీపాన..ఎన్నికలు పూర్తయిన తర్వాత టీడీపీ పరిస్థితి ఎలా? ఉందన్నది తెలిసిందే. ఎన్నికలకు ముందు కీలక వ్యక్తులు పార్టీలు మారడం..ఎన్నికల తర్వాత రాజకీయ భవిష్యత్ కోసం చంద్రబాబుకి ఊహించని షాకులు చాలా మంది నేతలే ఇచ్చారన్నది బహిరంగమే. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో టీడీపీ పార్టీని టాప్ నుంచి బోటమ్ వరకూ చూస్తే! పార్టీలో చాలా మార్పులే కనిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీపై వ్యతిరేకత…జెళ్లకు వెళ్లొచ్చిన ఘనత అన్నీ సంఘటనలు పార్టీకి ప్రతికూలంగా మారాయి అన్నది వాస్తవం.
ప్రభుత్వంపై వ్యతిరేకతే ఎజెండాగా గళం వినిపించిన టీడీపీ అంతర్లీనంగా ఏం జరుగుతుందో పట్టించుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందని ఇప్పుడు పార్టీ వర్గాల్లో సైతం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు రాజకీయ మైలేజ్ ని…క్రేజ్ ని కోల్పోతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలో కొంత మంది నేతలు చంద్రబాబుని సరిగ్గా టైమ్ చూసి సీక్రెట్ గా బాణాలు సంధించారనే విమర్శలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు చెంతనే ఉంటూ ఆయన్ని పట్టించుకోని వారు..ఎవరి అజెండాను వారు అమలు చేస్తున్న వారు ప్రతీ జిల్లాల్లోనూ ఉన్నారన్న అంశం పోలిటికల్ కారిడార్ లో చర్చకొచ్చింది.
ఎన్నికలకు ముందు చంద్రబాబు తమకు నిధులు ఇవ్వలేదనో? అధికారంలో ఉన్నప్పుడు బాబు తమని పట్టించుకోలేదనో? పదవులు ఇవ్వలేదనో..ఇలా చాలా కారణాలతో సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి జ్వాలల్ని నేతలు తెరపైకి తీసుకొస్తున్నారుట. వీటన్నింటిని చంద్రబాబు అంచనా వేయడంలో విఫలమయ్యారని..ఈ కారణంగా ఆయన రాజకీయ మైలేజ్ తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్షేత్ర స్థాయిలోనే ఇలాంటి అసంతృప్తి ప్రబల్లితోందని అంటున్నారు. వీటన్నింటికి మించి చంద్రబాబు తలబొబ్బి కట్టించే అంశం ఉన్నవారితో వేగలేని పరిస్థితి వచ్చిందంటున్నారు. నేతల్ని సమన్వయ పరచడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదని ఇన్ సైడ్ టాక్.