Jana Sena In Big Danger : టీడీపీ సిల్లీ పాలిటిక్స్: జనసేనను తొక్కేస్తూ.. తాను నాశనమైపోతూ.!

Jana Sena In Big Danger

Jana Sena In Big Danger : జనసేన పార్టీని గ్రామ స్థాయిలో నాశనం చేసేందుకు తెలుగుదేశం పార్టీ నడుం బిగించింది. ‘వచ్చే ఎన్నికల్లో మేం కలిసి పోటీ చేయబోతున్నాం.

జనసేన నుంచి ఫలానా నియోజకవర్గంలో ఎవరూ పోటీ చేయరు. జనసేన జెండా ఎగురవేయడం వల్ల ప్రయోజనం లేదు. మా పార్టీలోకి వచ్చేయండి..’ అంటూ గ్రామ స్థాయిలో తెలుగు తమ్ముళ్ళు పచ్చ ప్రచారం షురూ చేయడంతో జనసేన శ్రేణులు నిర్ఘాంతపోతున్నాయి.

నిజానికి, జనసేన పార్టీ ప్రస్తుతానికైతే కేవలం బీజేపీతోనే పొత్తు పెట్టుకుని వుంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడమే బెటరన్న ఆలోచన జనసేనకు వుంది. ఒకవేళ బీజేపీతోపాటు టీడీపీ కూడా మద్దతివ్వడానికి ముందుకొస్తే, ‘సరే’ అనడానికీ జనసేన సిద్ధంగానే వుంది.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ వుండాలనీ, సీట్ల పంపకాల విషయంలోనూ జనసేనదే పై చేయి అవ్వాలనీ జనసేన మాత్రమే కాదు, బీజేపీ కూడా కోరుకుంటోంది.

కానీ, అందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేయదు. ఎందుకంటే, రాష్ట్రాన్ని తాను ముఖ్యమంత్రినైతే మాత్రమే ఉద్ధరించగలననే గుడ్డి నమ్మకంతో వున్నారు చంద్రబాబు.

ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా వుండి చంద్రబాబు పోలవరం పూర్తి చేయగలిగారా.? అమరావతిని కట్టగలిగారా.? రెండూ చేతకాలేదు గనుక, ముఖ్యమంత్రి అన్న ఆలోచనే టీడీపీ విరమించుకోవాలన్నది జనసేన, బీజేపీ వాదన.

ఈ నేపథ్యంలోనే, జనసేన పార్టీని కింది నుంచి తుంచెయ్యడానికి టీడీపీ తనదైన వ్యూహాల్ని సిద్ధం చేసింది. నిజమే, ఇలాంటి చెత్త రాజకీయాలు చేయడంలో టీడీపీ తర్వాతే ఎవరైనా.