Gallery

Home News తెలంగాణ టీడీపీలో ఆ పోస్ట్.. అట్టర్ ఫ్లాప్

తెలంగాణ టీడీపీలో ఆ పోస్ట్.. అట్టర్ ఫ్లాప్

Tdp Number Two Sentiment Again

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అత్యంత దయనీయ స్థితిని ఎదుర్కొంటోన్నది పాత మాటే. కొత్తగా వచ్చిన మార్పులేమీ లేవు. పతనమైపోవడం, మరింత పతనమైపోవడం.. అంతే తేడా. తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ.. అనదగ్గ నాయకులంతా టీడీపీని వీడి వెళ్ళిపోతూ వస్తున్నారు. ఈ ప్రవాహం ఆగడంలేదు. తెలంగాణలో టీడీపీకి మనుగడ లేదన్న నిర్ణయానికి వచ్చేసినవారెవరూ పార్టీలో వుండలేకపోతున్నారు.

టీడీపీని అంటిపెట్టుకుని వుండడం వల్ల రాజకీయంగా తమ స్థాయి మరింత దిగజారిపోవడం తప్ప, ఎదుగుదల అనేదే వుండదన్న గట్టి నమ్మకం తెలంగాణ టీడీపీ నాయకుల్లో ఎప్పుడో ఏర్పడిపోయింది. దానికి చంద్రబాబు అనుసరించిన, అనుసరిస్తున్న విధానాలే కారణం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో వదులుకుని, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అధికారం దక్కించుకున్నారు.

అనంతరం తెలంగాణలో తన సోదరి షర్మిల ద్వారా కొత్త రాజకీయానికి తెరలేపారు. ఆ మాత్రం తెలివి 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ.. అని చెప్పుకునే చంద్రబాబుకి లేకుండా పోయింది. ఓ దేవేందర్ గౌడ్, ఓ నాగం జనార్ధన్ రెడ్డి, ఓ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఓ రేవంత్ రెడ్డి.. ఇలా పార్టీ ముఖ్య నేతలు (నెంబర్ టూ అనదగ్గవారు) టీడీపీని వీడి చాలాకాలమే అయ్యింది. ఆయా సందర్భాల్లో వాళ్ళంతా చంద్రబాబుకి హ్యాండ్ ఇచ్చేస్తూ వచ్చారు. తాజాగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేయబోతున్నారు. త్వరలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరబోతున్నారట.

ఇందుకోసం ఆయన రంగం సిద్ధం చేసేసుకున్నారనీ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణతో చర్చలు జరుపుతున్నారనీ తెలుస్తోంది. సో, టీడీపీకి మళ్ళీ తెలంగాణలో కొత్త అధ్యక్షుడి అవసరం ఏర్పడిందన్నమాట. ఇటీవలే టీడీపీ, పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సంబరాల్ని జూమ్ ద్వారా నిర్వహించింది. ఇంతలోనే టీడీపీకి సూపర్ షాక్ తగలబోతుండడం గమనార్హం. ఇదంతా చంద్రబాబు స్వయంకృతాపరాధమే.

- Advertisement -

Related Posts

పోరు గడ్డపై ఉప పోరు

ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణ. ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కూడా అప్పట్లో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు కూడా కరీంనగర్నే సెంటిమెంట్ జిల్లాగా ఎంచుకున్నాడు. ఇక్కడి నుంచే మలి...

కేంద్ర మంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్.. అంత సీన్ వుందా.?

గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అరడజను సీట్లలో పోటీ చేసే అవకాశమూ దక్కించుకోలేకపోయింది జనసేన పార్టీ. బీజేపీ కంటే ఓట్ల శాతం పరంగా మెరుగ్గానే వున్నా, తిరుపతి ఎంపీ టిక్కెట్టుని...

యాక్షన్ షురూ చేసిన సీఎం జగన్ ! త్వరలో ‘RRR’పై వేటు ఖాయం !

గత కొంతకాలం నుండి వైసీపీ పార్టీ, సీఎం జగన్ మీద సొంత పార్టీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు ఎదురుదాడి చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధ్యక్షుడు మిన్నకుండి పోవటంతో నాయకుల,...

Latest News