టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుపై వైకాపా ఎంపీ, రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి ల మధ్య ట్విటర్ వార్ షురూ అయిందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇటీవలే విజయసాయి టీడీపీని ఉద్దేశించి ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కొడుకేమో తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు. సీనియర్లంతా చేతులెత్తేసారు. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్ కు ముళ్ల కిరటీ తగిలిస్తున్నాడు బాబు గారు. రాజధాని విషయంలో బాబు నవ్వుల పాలయ్యారు. ఉత్తరాంద్ర ప్రజల్ని బుజ్జగించాలని అమాయకుడిని బలిపీటం ఎక్కిస్తున్నాడు అంటూ ట్వీట్ చేసారు. అంతకు ముందు టీడీపీ అధినేతపైనా విజయసాయి ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు.
అయితే తాజాగా ఈ సీన్ లోకి రామ్మోహన్ నాయుడు కూడా దిగారు. విజయసాయికి తనదైన శైలిలో బధులిచ్చారు. అల్లుడేమో అవినీతికి తిమ్మరాజు పనికి పోతురాజు. సీనియర్లు అందరూ చేతగానోడి పాలన చూసి `ఛీ` కోడుతున్నారు. కారు దించాశారనే కక్షతో మామ అప్రూవర్ గా మారి అల్లుడిని కుర్చీ నుంచి దించేయాలని కుట్ర మొదలు పెట్టాడు. ప్రత్యేక హోదాపై చేతులెత్తేసారు. ఉత్తరాంధ్ర రైల్వే జోన్ పట్టాలెక్కించడం చేతకాలేదంటూ ట్వీట్ చేసారు. అయితే ట్వీట్ లో మామ-అల్లుడు అని రామ్మోహన్ నాయుడు అనడం ఆసక్తికరంగా మారింది. పేర్లు పెట్టకుండా మామ-అల్లుడు అంటూ ఎవర్ని! అన్నట్లు అన్న ఆసక్తి నెటిజనుల్లో నెలకొంది.
మరి ఈ ట్వీట్ పై విజయసాయి ఎలా రియాక్ట్ అవుతారో? అసలే సోషల్ మీడియాలో విజయసాయి యమా స్పీడ్ మీద ఉంటారు. ఎవరైనా కౌంటర్ల వేసినా..ఎవరిపైనైనా కౌంటర్లు వేయాలన్నా? ఇదే వేదికపై విజయసాయి విరుచుకుపడుతుంటారు. మరి రామ్మోహన్ నాయుడు ట్వీట్ తో సీన్ వేడెక్కడం ఖాయం. మామ-అల్లుడు అంటూ మరీ వ్యక్తిగత ట్వీట్ గాను దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం విజయసాయి-రామ్మోహన్ నాయుడు పేర్లు టీడీపీ, వైకాకా పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. మరి ట్విటర్ వార్ ఎంతకు దారి తీస్తుందో. ఏమో!