AP: సీనియర్ నటుడు నాయకుడు దివంగత నందమూరి తారకరామారావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఏడాది జరగబోయే మహానాడు కార్యక్రమం ఎంతో ప్రత్యేకంగా మారబోతోంది. ఈ మహానాడు వేడుకను మొదటిసారి వైయస్సార్ కంచుకోట అయినటువంటి కడప జిల్లాలో నిర్వహించబోతున్నారు. ఇప్పటికే కడప జిల్లా మొత్తం పసుపు మయంగా మారిపోయింది.
మరి కాసేపటిలో ఈ మహానాడు కార్యక్రమం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు కార్యకర్తలు కడపకు చేరుకున్నారు. ఇక ఈ మహానాడు కార్యక్రమంలో భాగంగా కార్యకర్తే అధినేత, “యువగళం”, “స్త్రీ శక్తి”, “సామాజిక న్యాయం”, “అన్నదాతకు అండ”, “తెలుగు జాతి – విశ్వ ఖ్యాతి” అనే ఆరు సూత్రాల చుట్టూ కొనసాగనుంది. ఇందులో ప్రతి అంశంపై చర్చించి తీర్మానాలు కూడా చేయబోతున్నారు.
ఇకపోతే ఈ మహానాడు కార్యక్రమంలో భాగంగా చిన్నబాబు అయినటువంటి లోకేష్ కు కీలక బాధ్యతలను కూడా అప్పగించబోతున్నట్టు వార్తలు వినపడుతున్నాయి. గత కొంతకాలంగా నారా లోకేష్ కు తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఇవ్వాలి అంటూ పలువురు నేతల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.లోకేష్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే డిమాండ్‌ను, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామంటున్నారు.
ఈ మహానాడు కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం సీఎం నారా చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకోవడానికి నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే సమయంలో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టే ప్రకటన జరిగే అవకాశం ఉంది. ఇలా ఈ మహానాడు కార్యక్రమంలో భాగంగా లోకేష్ కీలక బాధ్యతలను తీసుకోబోతున్నారని తెలుస్తోంది.