లోకేశ్.. టీడీపీ అధినేత కొడుకు. అంతేనా.. ఈయనకంటూ ప్రత్యేకంగా ఏ గుర్తింపు లేదా? అంటే లేదనే చెప్పుకోవాలి. తన ప్రొఫెషనల్ లైఫ్ ను వదులుకొని మరీ.. రాజకీయాల్లోకి వచ్చారు లోకేశ్. రానైతే వచ్చారు కానీ.. రాజకీయాలు లోకేశ్ కు అంతలా అంటుకోలేదు. ఇతర నేతల్లా రాజకీయాల్లో లోకేశ్ చురుకుగా ఉన్నప్పటికీ.. ఆయన మాట్లాడే తీరు, జనాల్లో కలిసిపోయేతనం అనేది సరిగ్గా లేకపోవడంతో ఆయన రాజకీయాల్లో బిగ్ ఫెయిల్యూర్ అనే చెప్పుకోవాలి.
ఏది ఏమైనా ఆయన పార్టీ అధినేత కొడుకు, పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ మనవడు.. కాబట్టి టీడీపీ అభిమానులు కూడా లోకేశ్ ను ఎలాగోలా భరిస్తున్నారు.. అనే టాక్ బయట వినిపిస్తుంది.
ఇక.. అసలు విషయానికి వస్తే.. కరోనా సమయంలో చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ హైదరాబాద్ ను వదల్లేదని… హైదరాబాద్ లో ఉండే జూమ్ మీటింగులు నిర్వహించారని.. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ విమర్శించారు.
ఏమాత్రం లోకజ్ఞానం లేని లోకేశ్… వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. అఆలు కూడా రాని లోకేశ్ ను చంద్రబాబు మంత్రిగా చేశారు. కానీ.. లోకేశ్ మాత్రం కనీసం వార్డ్ మెంబర్ గా కూడా గెలవడని జోగి ఎద్దేవా చేశారు.
అంతెందుకు.. లోకేశ్ మీద వాలంటీర్ ను పెట్టినా వాలంటీర్ గెలుస్తాడు. వాలంటీర్ ను మేం గెలిపించుకుంటాం.. కానీ.. లోకేశ్ మాకు వద్దు.. అంటూ ఎమ్మెల్యే విమర్శించారు.
చంద్రబాబు దివాళా తీసిన టీడీపీ అధ్యక్షుడు. హైదరాబాద్ లో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ పై ప్రధాని మోదీకి లేఖ రాశారు. దానికి అసలు ఆధారాలు ఏవైనా ఉన్నాయా? ఆధారాలు చూపించకుండా.. ప్రధానికి లేఖ రాసినంత మాత్రాన ఏం జరుగుతుంది. మీడియాలో వచ్చే పనికిమాలిన కథనాలను ఆధారాలుగా చూపిస్తారా.. ఇదేనా చంద్రబాబు దశాబ్దాల రాజకీయ అనుభవం.. అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు.