ఎడ్యుకేషన్ పరంగా దేశంలో పొరుగు రాష్ర్టాలు…ఇతర రాష్ర్టాలు ఎంత వేగంగా ముందుకు వెళ్లాయో! నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్సార్ సీఎం కాకముందే ఎడ్యుకేషన్ పరంగా మనం అంతకంతకు వెనక్కి వెళ్లిన మాట వాస్తవం. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం డబ్బున్నవాడికే చదువు. అధికారం ఉన్నవాడికే కాలేజీలో సీట్లు. కానీ వైఎస్సార్ ఎంట్రీ తో ఆ సీన్ ఒక్కసారిగా తారుమారైంది. పేదోడు ఇంజనీరు అయ్యాడు. బిల్డింగ్ లు కట్టాడు. ఇది వైఎస్సార్ ఎన్నో ఏళ్ల నాటి కల. ఇంకా మరెన్నో పేదవాడి కలలను సాకారం చేసి అనూహ్య ఘటనలో నింగికెగిసారు. నిరుపేద విద్యార్ధి చదువు గురించి మాట్లాడు కోవాల్సి వస్తే వైఎస్సార్ ముందు..తర్వాత అని కచ్చితంగా చెప్పుకోవాల్సిందే.
ఇప్పుడు యంగ్ సీఎం, వైఎస్సార్ తనయడు జగన్మోహన్ రెడ్డి కల కూడా సాకరమైంది. పిల్లల భవిష్యత్ బాగుండాలంటే ఇంగ్లీష్ మీడియంలో చవదించాలని దానికనుగుణం అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తప్పని సరి చేయాలని సీఎం భావించిన నేపథ్యంలో ప్రతి పక్షాలు ఎలాంటి నీచ రాజకీయాలు చేసాయో? జగన్ పిల్లల భవిష్యత్ నాశనం చేస్తున్నట్లు ఎలా వ్యాఖ్యానించాయో ప‌్రజలకి తెలిసిందే. తెలుగు భాషను అడ్డుపెట్టుకుని టీడీపీ, జనసేన పార్టీలు విద్యార్ధుల తల్లిదండ్రులను ప్రభుత్వం మీదకు ఉసిగొల్పే కుళ్లు రాజకీయాలు చేసారు. తాజాగా ఓ సర్వేతో ఆ రెండు పార్టీలకు ప్రజలకు చెంప దెబ్బలాంటి సమాధానం ఇచ్చారని అర్ధమవుతోంది.
హైకోర్టు సూచన మేరకు జగన్ సర్కార్ విద్యార్ధులు వారి తల్లిదండ్రులు ఏ మాధ్యమంలో చదివించాలనుకుంటున్నారు అన్న దానిపై ప్రభుత్వం ఓ సర్వే నిర్వహించింది. ఈ బాధ్యతను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్. సీ.ఈ.ఆర్ .టీ) కీ అప్పగించింది. ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్ధుల తల్లిదండ్రులకు మూడు ఆప్షన్లు ఇచ్చి..వారి నుంచి లిఖిత పూర్వ అభిప్రాయాలు సేకరించారు. ఇందులో ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్ అని, ఓన్లీ తెలుగు మీడియం, ఇతర భాషాల మీడియం ఇలా మూడుగా విభజించారు.
ఈ మూడు ఆప్షన్ల ముందు విద్యార్ధుల తల్లిదండ్రులు 96.17 శాతం మంది ఇంగ్లీష్ మీడియానికే తొలి ప్రాధాన్యత ఇచ్చారు. తెలుగు మీడియంలోనే బోధన కావాలనుకున్న వారు 3.05 శాతం, ఇతర మీడియం కోరుకున్న వారు 0.78 శాతం మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతల్లో ప్రజలు ఇంగ్లీష్ మీడియం కోరుకోవడంతో ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. దీంతో 2020-21 విద్యా సంవత్సారాల నుంచి ప్రభుత్వం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.