మాల్ లో స్నేహితులతో కలిసి చిల్ అవుతున్న తారక్.. ఫోటోలు వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కినత్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఎంతో మంచి విజయాన్ని అందుకుని పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా అనంతరం తన 31వ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా ప్రారంభం కానుంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ 30 ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్నప్పటికీ, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా అనంతరం తారక్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ కానున్నారు. ఇకపోతే కొరటాల శివ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా షాపింగ్ మాల్ వెళ్లిన తారక స్నేహితులతో కలిసి బాగా చిల్ అవుతున్నారు.

తారక్ తన స్నేహితులతో కలిసి సరదాగా సింగపూర్ లో
ప్రముఖ టీఎస్ఎంబీఎస్ మాల్‌లో తన స్నేహితులతో చిల్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మాల్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఎన్టీఆర్ తన కెరియర్ లో కొరటాల శివతో కలిసి జనతాగ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఎన్టీఆర్ 30 సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.