ప్రభాస్ పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలుగు ఇండస్ట్రీ లో సీనియర్ మోస్ట్ డైరెక్టర్ లో ఒకరు తమ్మారెడ్డి భరద్వాజ. తరచూ సినిమాలు, సినిమా ఇండస్ట్రీ కి సంబంధించి విషయాలపై స్పందిస్తూ ఉంటాడు తమ్మారెడ్డి. తాజాగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీజర్ పై స్పందించాడు తమ్మారెడ్డి భరద్వాజ.

‘ఆదిపురుష్’ టీజర్ విడుదల అయిన మరుసటి రోజు నుంచి ఇప్పటివరకు నెగిటివ్ గా కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.ఆదిపురుష్‌ టీజర్‌ మీద జరిగిన ట్రోల్స్‌ అన్నీ ఇన్నీ కాదు. కార్టూన్‌ సినిమా అని, యానిమేషన్‌ సినిమా అంటూ గోల చేస్తూ సోషల్ మీడియాలో భారీగా రచ్చ రచ్చ చేసారు.అంతేకాకుండా రాముడు, రావణుడు, హనుమంతుడు గెటప్ ల విషయంలో కూడా భారీగా విమర్శలు వచ్చాయి.

టీజర్ పై స్పందిస్తూ ఆదిపురుష్‌ ట్రైలర్‌ చూశాను.ప్రభాస్‌ సినిమా అంటే వాడి వేడిగా ఉంటుందని,అంతేకాకుండా రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌ ముంబైలో చేస్తున్నారు అని తెలిపారు.కానీ ఆ ట్రైలర్‌ చూసిన తర్వాత చాలా డిజప్పాయింట్‌గా అనిపించింది అని తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజ.