Pawan Kalyan: ఓజీ సినిమా నుంచి స్పెషల్ ఫోటోస్ రిలీజ్.. పవన్ కళ్యాణ్ తో ఆ తమిళ స్టార్!

Pawan Kalyan: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటూనే మరొకవైపు తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే ఇటీవల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓజీ సినిమా కోసం పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగు శరవేగంగా జరుగుతోంది.

విజయవాడ దగ్గర్లో వేసిన ఒక సెట్ లో ఓజీ సినిమా షూట్ జరుగుతోంది. కాగా ఈ సినిమాలో చాలా తమిళ్, బాలీవుడ్ స్టార్స్ చాలామందే ఉన్న విషయం తెలిసిందే. తాజాగా తమిళ్ స్టార్ అర్జున్ దాస్ ఓజీ షూట్ లో పాల్గొనగా పవన్ తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. పవన్ తో సరదాగా మాట్లాడి, సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ షేర్ చేసి మీతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. మీతో పని చేసిన ప్రతి రోజు ఎంజాయ్ చేసాము.

మీ బిజీ షెడ్యూల్ లో కూడా షూట్ గ్యాప్ లో మమ్మల్ని కుర్చో బెట్టుకొని మాట్లాడినందుకు థ్యాంక్యూ. మన మాటలు ఎప్పటికి గుర్తుంటాయి. మీతో మళ్ళీ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఎప్పటికి రుణపడి ఉంటాను అని రాసుకొచ్చాడు అర్జున్ దాస్. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ని కూడా పూర్తి చేనున్నారు పవన్ కళ్యాణ్.