తమన్నా ఇంకోస్సారి: ఆ టైపు పాత్రలో.?

ఛాలెంజింగ్ పాత్రలను ఎంచుకోవడంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తోంది ముద్దుగుమ్మ తమన్నా భాటియా. రీసెంట్‌గా ‘మ్యాస్ట్రో’ సినిమా కోసం నెగిటివ్ అవతారమెత్తింది మిల్కీ బ్యూట. ఆ తర్వాత ‘సీటీమార్’‌లో పక్కా తెలంగాణా అమ్మాయిగా తనదైన నటనతో ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు మరోసారి నెగిటివ్ రోల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇండస్ర్టీ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. ఓ యంగ్ హీరో నటిస్తున్న సినిమాలో తమన్నా నెగిటివ్ రోల్ ఛూజ్ చేసుకుందట. కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడట. ఓ ప్రముఖ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందబోతోందని తెలుస్తోంది.

‘మ్యాస్ట్రో’ సినిమాలో రకరకాల హావభావాలు పలికించిన తమన్నా నటనకు మంచి మార్కులే పడ్డాయి. అంతకు మించి అనేలా ఈ సినిమాలో తమన్నా పాత్రను డిజైన్ చేశారట. ఈ సినిమా కథ కూడా థ్రిల్లింగ్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. ఆథ్యంతం ఆసక్తిగా సాగే కథా, కథనాలతో ఆకట్టుకోనుందని ప్రచారం జరుగుతోంది.